గ్రీస్ లో తగ్గుతున్న జనాభా.. ఒకరు పుడితే ఇద్దరు చనిపోతున్నారట?
ఒకప్పుడు చైనా అధిక జనాభా గల దేశంగా ఉండేది. ప్రస్తుతం అది రెండో స్థానంలోకి వెళ్లిపోయింది
ప్రపంచంలో ప్రతి దేశం జనాభా సమస్యను ఎదుర్కొంటోంది. ఒకప్పుడు అధిక జనాభా అని అనుకున్న దేశాలు నేడు పిల్లల్ని కనండని ఆఫర్లు ఇస్తున్నాయి. కానీ కుదరడం లేదు. దీంతో జనాభా రోజురోజుకు తగ్గిపోతోంది. చిన్న దేశాలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెద్ద దేశాలు సైతం దిద్దుబాటు చర్యలకు దిగినా ఫలితాలు కానరావడం లేదు. ప్రపంచ స్థితిగతులే మారిపోతున్నాయి.
ఒకప్పుడు చైనా అధిక జనాభా గల దేశంగా ఉండేది. ప్రస్తుతం అది రెండో స్థానంలోకి వెళ్లిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలిచింది. దీంతో చైనాలో కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదు. అందరు పిల్లల్నికనండని ప్రభుత్వం చెబుతున్నా వీలు కావడం లేదు. దీంతో క్రమేపీ జనాభా తగ్గుతోంది. దీనిపై డ్రాగన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గ్రీస్ లో కూడా విచిత్ర పరిస్థితి ఏర్పడుతోంది. అక్కడ రోజుకు ఒకరు జన్మిస్తే ఇద్దరు చనిపోతున్నారు. దీంతో జనాభా కాస్త తగ్గిపోతోందని ఆ దేశం బాధపడుతోంది. 2011లో ఆ దేశ జనాభా 1.11 కోట్లు కాగా ప్రస్తుతం 1.07 కోట్లుగా ఉంది. పదేళ్లలో 7 లక్షల మంది చనిపోయారు. దీంతో జనాభా విషయంలో ఆందోళన నెలకొంది. తమ జనాభా ఇలా తగ్గిపోతే ఎలా అనే బెంగ వారిలో పట్టుకుంది.
2050 నాటికి ఆ దేశ జనాభా 90 లక్షలకే పరిమితం అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఇలా జరిగితే తమ దేశ సంతతి చిక్కుల్లో ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. పిల్లల్ని కనండని తెగ ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ దేశ యువత పెళ్లి, పిల్లలను కనడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో దేశం యావత్తు జనాభా కావాలని గగ్గోలు పెడుతోంది.
ఇలా చాలా దేశాలు జనాభా సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇన్నాళ్లు అధిక జనాభా అనుకున్నా ఇప్పుడు అదే కావాలని కోరుతున్నా కుదరడం లేదు. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనాలని ఆఫర్లు సైతం ఇస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. దీంతో గ్రీస్ జనాభా పెంచుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది.