మహా విషాదాల... మహాకుంభమేళా..: లెక్కలు ఇవే!
వీటిలో పైకి కనిపించేవి కొన్నేవని చెప్పడం.. వెలుగులోకి రాని అనేక మరణాలు కూడా ఉండడం గమనా ర్హమని కూడా అంటోంది.
''144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక్కసారైన స్నానం చేస్తే.. గత జన్మ పాపాలు తొలిగిపోతాయి'' - ఓ సాధువు చెవులు పగిలేలా చెబుతాడు.
''ఈ జన్మలో మనకు లభించిన అద్భుత అవకాశం మహాకుంభమేళానే. ఇప్పుడు మిస్సయితే.. ఇక ఎప్పటి కీ.. అవకాశం లేదు. రాదు!'' - తేల్చేసి మరీ కుండబద్దలు కొడతాడు.. మరో హిందూత్వ వాది.
''ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాం. 12 కిలో మీటర్ల మేర ఘాట్ ఏర్పాటు చేశాం. ఎంత మంది వచ్చినా.. ఎలాంటి ఇబ్బందీ లేదు. రండి.. వచ్చి పుణ్యస్నానం చేయండి'' - యూపీ ప్రభుత్వం అధికారంకగా దేశవ్యాప్తంగా ఇస్తున్న మీడియా ప్రకటనలు.
- మొత్తంగా అన్ని వైపుల నుంచి మహాకుంభమేళాను సెంటిమెంటుతో కలగలిపి ప్రజలను ఆదిశగా అడు గులు వేసేలా చేస్తున్నారు. కానీ, మహాకుంభమేళా ఏర్పాట్లు ఎలా ఉన్నా.. అక్కడకు వస్తున్న భక్తులు మాత్రం నరకం చవిచూస్తున్నారన్నది వాస్తవం. ఇప్పటి వరకు ఒక్క కుంభమేళాకు సంబంధించిన ఘటనల్లో సుమారు 250 మందికిపైగా మృతి చెందారని జాతీయ మీడియా వెల్లడిస్తోంది.
వీటిలో పైకి కనిపించేవి కొన్నేవని చెప్పడం.. వెలుగులోకి రాని అనేక మరణాలు కూడా ఉండడం గమనా ర్హమని కూడా అంటోంది. నిజానికి గత నెలలో సెక్టార్-2లో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట కు ముందే.. ఇక్కడే రెండు సార్లు తొక్కిసలాటలు జరిగాయి. ఆయా ఘటనల్లో 12 మంది వరకు మృతి చెందా రు. కానీ, వీరంతా ఒకే సారి మృతి చెందకపోవడంతో పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇక, నాలుగు సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి. వీటిలోనూ 8 మంది వరకు మృతి చెందారన్నది స్థానిక మీడియానే చెప్పిన మాట.
అదేసమయంలో మౌని అమావాస్య నాడు 80 మంది వరకు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు సరైన సంఖ్యను చెప్పలేదు. తాజాగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది విగతజీవులయ్యారు. దీనికి ముందు.. అలహాబాద్-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో(వీరంతా పుణ్యస్నానం చేసినవారే) 32 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు చనిపోయారు.
వీరిలో తెలంగాణకు చెందిన వారు ఏడుగురు, తమిళనాడుకు చెందిన 8 మంది, కర్ణాటకకు చెందిన వారు 12 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. సో.. ఎలా చూసుకున్నా.. మహాకుంభమేళా.. మహా విషాదంగా మారుతోంది. కాగా.. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా నిర్వహించనున్నారు.