ఐఐటీ ఖరగ్ పూర్ ప్లేస్ మెంట్స్ పై ఆర్టీఐ... తెరపైకి కీలక విషయాలు!

అవును... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌ పూర్‌ లో ప్లేస్ మెంట్స్ కి సంబంధించి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

Update: 2024-04-30 08:26 GMT

సాధారణంగా ఐఐటీల్లో సీటు వస్తే చాలు లైఫ్ కి మినిమం గ్యారెంటీ అని అంటుంటారు! ఐఐటీల్లో చదువు పూర్తి చేస్తే చాలు లక్షల రూపాయల ప్యాకేజీతో కొలువులు సొంతం అనే మాటలు వినిపిస్తుంటాయి. అయితే... సమాజంలో ఉన్న ప్రచారాలు, పబ్లిసిటీలు వేరు.. వాస్తవాలు వేరనే చర్చ ఈ ఐఐటీల విషయంలో తాజాగా తెరపైకి వచ్చిందనే కామెంట్లు తాజాగా తెరపైకి వచ్చాయి!

అవును... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌ పూర్‌ లో ప్లేస్ మెంట్స్ కి సంబంధించి ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. సమాచార హక్కు (ఆర్టీఐ) డేటా ప్రకారం... ఐఐటీ ఖరగ్‌ పూర్‌ లో ముప్పై మూడు శాతం మంది విద్యార్థులు గత సంవత్సరం ప్లేస్‌ మెంట్‌ లను పొందలేకపోయారు.

దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐఐటీలలో కూడా ఈ సమస్య ఉందా అనే చర్చ మొదలైంది! ఇందులో భాగంగా... 2022-2023 విద్యా సంవత్సరంలోని ప్లేస్‌ మెంట్ సీజన్‌ లో 2,490 మంది విద్యార్థులు ప్లేస్‌ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోగా... వారిలో 1,675 మంది మాత్రమే ప్లేస్‌ మెంట్‌ లను పొందారని.. 574 మంది ప్రీ-ప్లేస్‌ మెంట్ ఆఫర్‌ లను అందుకున్నారు!

ఇదే సమంలో... 2021-22 ప్లేస్‌ మెంట్ సీజన్‌ లో, ఐఐటీ ఖరగ్ పూర్ లో 2,256 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 1,615 మంది విద్యార్థులకు మాత్రమే ఉద్యోగలు వచ్చాయని.. మిగిలిన 404 మందికి ప్రీ-ప్లేస్ మెంట్ ఆఫర్లు వచ్చాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వీరి సగటు వార్షిక వేతనం 16 నుంచి 18 లక్షల రూపాయలుగా ఉందని తెలుస్తుంది!

ఇదే క్రమంలో... ఐఐటీ జమ్మూకి చెందిన 251 మంది విద్యార్థులు ప్లేస్‌ మెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ప్రస్తుతం జరుగుతున్న ప్లేస్‌ మెంట్ రౌండ్‌ లో కేవలం 126 మంది మాత్రమే ఉద్యోగ ఆఫర్‌ లను పొందగలిగారని తెలుస్తోంది!

Tags:    

Similar News