రాహుల్ భార‌తీయుడు కాడు.. బాంబు పేల్చిన‌ సుబ్ర‌మ‌ణ్య స్వామి.. ట్విస్ట్ ఏంటంటే!

అంతేకాదు.. దీనికి సంబందించిన ఆధారాల‌ను కూడా ఆయ‌న కేంద్రానికి అందించారు.

Update: 2024-08-10 22:30 GMT

పార్ల‌మెంటులో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని టార్గెట్ చేసుకుని ఇటీవ‌ల కాలంలో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటున్న కాంగ్రెస్ ముఖ్య‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి బాంబు పేల్చారు. రాహుల్ అస‌లు భార‌తీయుడేనా? అనే సందేహంతో కూడిన ప్ర‌శ్న లేవ‌నెత్తుతూనే.. మోడీని ఇందులో ఇరికించారు. రాహుల్ కు బ్రిటీష్ పౌర‌స‌త్వం కూడా ఉంద‌ని.. అలాంట‌ప్పుడు భార‌తీయుడు ఎలా అవుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. దీనికి సంబందించిన ఆధారాల‌ను కూడా ఆయ‌న కేంద్రానికి అందించారు. దీంతో కేంద్ర హోం శాఖ రాహుల్‌కు ఆఘ‌మేఘాల‌పై నోటీసులు పంపించింది.

ఏం జ‌రిగింది?

2003లో ఇంగ్లండ్, విన్‌చెస్టర్ లో రిజిస్టర్ అయిన BACKOPS LIMITED అనే కంపెనీ డైరెక్టర్ గా రాహుల్ గాంధీ పేరు కొన‌సాగుతోంది. దీనిని ఏటికేడు పునరుద్ధ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాను బ్రిటిష్ పౌరుడిని అంటూ రాహుల్ గాంధీ ఓ స‌ర్టిఫికెట్‌ను బ్రిట‌న్ ప్ర‌భుత్వానికి అందించారు. గ‌త ఏడాది కూడా దీనిని అలానే రెన్యువ‌ల్ చేశారు. దీనిని సాధించిన సుబ్ర‌మ‌ణ్య స్వామిని.. ఈ స‌ర్టిఫికెట్ ఆధారంగానే కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు... ఆయ‌న ట్వీట్‌లో కీల‌క‌మైన కామెంట్ చేశారు. ``రాహుల్‌గాంధీ బ్రిట‌న్ పౌరుడిగా పేర్కొంటూ.. బ్రిట‌న్ ప్ర‌భుత్వానికి వార్షిక రిట‌ర్న్ దాఖ‌లు చేశారు. దీనిపై ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోకుండా మోడీని సోనియాగాంధీ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?`` అని సుబ్ర‌మ‌ణ్య స్వామి ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు.. సుబ్ర‌మ‌ణ్య స్వామి ఇచ్చిన స‌ర్టిఫికెట్లు, చేసిన ఫిర్యాదు ఆధారంగా కేంద్ర హోం శాఖ రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సుబ్ర‌మ‌ణ్య స్వామి లేవ‌నెత్తిన విష‌యంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సంబంధిత నోటీసులో కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అయితే.. ఇక్క‌డే బిగ్ ట్విస్ట్ ఉంది. ఇదంతా జ‌రిగిపోయింది గతంలోనే. అయితే.. అప్ప‌ట్లోనే రాహుల్ గాంధీ త‌న పౌర‌సత్వంపై వివ‌ర‌ణ కూడాఇచ్చారు. అయితే.. దానిని ఏం చేశార‌న్న‌దే ఇప్పుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి సంధించిన మ‌రో ప్ర‌శ్న‌. అందుకే.. గ‌తం తవ్వుతూ.. ఆయ‌న సంచ‌ల‌నం రేపారు. ఇదే విష‌యాన్ని మ‌రో ట్వీట్‌లో పేర్కొన్నారు. గ‌తంలో రాజ్‌నాథ్‌కు ఇచ్చిన రాహుల్ వివ‌ర‌ణ‌ను ఏం చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంతేకాదు.. అస‌లు రాహుల్ ఇచ్చిన వివ‌ర‌ణ ఏమైంద‌ని కూడా అన్నారు. మొత్తానికి పాత వివాదాన్ని కొత్త‌ది చేసిన సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌నం రేపారు. మ‌రి ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News