వైసీపీ గెలుపు కన్ఫాం అయిపోయినట్లేనా.. విశ్లేషణలు ఏమి చెబుతున్నాయి?

అయితే... పోలింగ్ రోజు తెరపైకి వచ్చిన కొన్ని కీలక పరిణామాలు.. వైసీపీ గెలుపును ప్రతిభించిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-05-31 09:34 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగియగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సందర్భంగా ఎన్నో విశ్లేషణలు, మరెన్నో అంచనాలు, పలు ధీమాలు, ఇంకొన్ని నమ్మకాలు, వీటికి తోడు జోస్యాలు వెరసి ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విపరీతంగా చర్చ నడుస్తుంది. ఈ సమయంలో మిగతావారితో పోలిస్తే వైసీపీ ధీమా పీక్స్ అని అంటున్నారు పరిశీలకులు.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచీ రాబోయే ఫలితాలపై తీవ్ర ఉత్కంట నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే... పోలింగ్ రోజు తెరపైకి వచ్చిన కొన్ని కీలక పరిణామాలు.. వైసీపీ గెలుపును ప్రతిభించిస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా పోలింగ్ రోజు ఉదయాన్నే అత్యధిక సంఖ్యలో వృద్ధులూ, మహిళలు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ కట్టారు.

ఫలితంగా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. అయితే... ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని పలువురు భ్రమపడినా, ఇంకొంతమంది ఆత్మవంచన చేసుకున్నా, అది ప్రో జగన్ ఓటే అనే అభిప్రాయాలు అన్నివర్గాల నుంచీ వినిపించిన పరిస్థితి! దీంతో... పోలింగ్ పూర్తయిన మరుసటి రోజునుంచీ ఏపీలో "మళ్లీ జగనే" అనే చర్చ మొదలైంది.

పైగా వైసీపీ వ్యతిరేక వర్గంగా ముద్రపడిన మీడియాలో వచ్చిన కొన్ని ఆత్మవంచన కథనాలు కూడా దీనికి బలం చేకూర్చాయని అంటున్నారు. దీంతో నాటి నుంచీ... ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే కొలువుదీరబోతుందనే కామెంట్లు వినిపించాయి. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా వినిపిస్తున్న విశ్లేషణలు కూడా ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు కన్ ఫాం అనే విషయాన్ని పరోక్షంగా బలపరుస్తున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో సుమారు 95శాతానికి పైగా హామీలను అమలు చేశామనే విషయాన్ని జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారని.. ప్రజలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ జగన్ ని నమ్మారని.. ఈ స్థాయిలో పాజిటివ్ పాలిటిక్స్ చేయడం సరికొత్త పరిణామనని అంటున్నారు. పైగా.. జగన్ చెప్పాడంటే చేస్తాడు అనే పేరు కూడా సంపాదించుకున్నారనే మాటలు వినిపించాయి.

వీటికితోడు సుమారు పోలింగ్ కి 10రోజుల ముందు ఏపీలో పెన్షన్ ఇంటింటికీ వెళ్లి ఇవ్వకుండా వాలంటీర్లను నిరోధించడం, ఈ సందర్భంగా మండుటెండలో వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టడం చంద్రబాబు పనే అని జనం బలంగా నమ్మారని అంటున్నారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి అనే విషయం కళ్లకు కట్టినట్లు కనిపించిందని చెబుతున్నారు.

ఇలా అంతా మన మంచికే అన్నట్లుగా... ఏపీలో ఎన్నికల వేళ అన్ని అంశాలూ వైసీపీకి అనుకూలంగా మారాయని.. పైగా ఒక వర్గం మీడియా పలువలు చిలువలు చేసి కురిపించిన విమర్శలు కూడా జగన్ పై ప్రజల్లో సానుభూతి కలగడంలో సహకరించాయనే కామెంట్లూ వినిపిస్తుండటం గమనార్హం. ఇలా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నా.. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యం అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!

ఇక జూన్ 4 మధ్యాహ్నం ఈ విషయంపై అధికారికంగా పూర్తి స్పష్టత రాబోతుంది.

Tags:    

Similar News