మూడోరోజు కొనసాగుతున్న ఐటీ రైడ్స్... తెరపైకి కీలక అప్ డేట్స్!

ఈ క్రమంలో ఇప్పటికే రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తుండగా.. మూడో రోజు గురువారం కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

Update: 2025-01-23 06:57 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఐటీ రైడ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా హైదరాబాద్ కేంద్రంగా ఈ హడావిడి జరుగుతుంది. ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తుండగా.. మూడో రోజు గురువారం కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.

అవును... హైదరాబాద్ లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా... సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లో సోదాలు చేశారు.

ఈ సందర్భంగా... మూడో రోజూ వీరి కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు! ఈ సందర్భంగా ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ప్రాథమిక ఆధారాలతో సినీ ప్రముఖులు, వారికి చెందిన సంస్థలపై కేసు నమోదు చేసిన తర్వాతే ఆదాయపు పన్ను శాఖ అధికార బృందాలు సోదాలు జరుపుతున్నాయని అంటున్నారు.

ఈ సందర్భంగా... నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారని.. ఇదే సమయంలో పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అదేవిధంగా బ్యాంక్ లాకర్స్ ని కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా మూడో రోజు ఐటీ అధికారులు జరుపుతున్న దాడుల్లో దిల్ రాజు, శిరీస్, దిల్ రాజు కుమార్తె హన్సితా రెడ్డి ఇల్లు, ఆఫీసులతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవి శంకర్, అభిషేక్ అగర్వాల్ వంటి బడా నిర్మాతల ఆఫీసులు, ఇళ్లు కూడా మూడో రోజు సోదాలు జరుగుతున్నవాటి జాబితాలో ఉన్నాయని తెలుస్తోంది.

కాగా... ఈ సంక్రాంతి సందర్భంగా ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు విడుదలయ్యాయి. అంతక ముందు ‘పుష్ప-2’ సినిమా సందడి చేసింది. వీటికి సంబంధించిన కలెక్షన్స్ వందల కోట్లు అంటూ పోస్టర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్లు చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News