ఐటీడీపీ విషయంలో నాడు విడదల రజనీ ఇంత చేశారా?

వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను విడదల రజనీ అక్రమ కేసులతో వేధించారంటూ చిలకలూరిపేట ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

Update: 2024-11-14 08:44 GMT

వైసీపీ నేత, మాజీమంత్రి విడల రజనీపై పల్నాడు జిల్లా ఎస్పీకి తాజాగా ఓ ఆసక్తికర ఫిర్యాదు అందింది. ఇందులో భాగంగా... వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను విడదల రజనీ అక్రమ కేసులతో వేధించారంటూ చిలకలూరిపేట ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుని కలిసి ఫిర్యాదు అందజేశారు.

అవును... గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్ఫింగ్ పోస్టులు పెట్టారంటూ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని.. అక్రమంగా నిర్భంధించి వేధించారని.. మాజీ మంత్రి విడదల రజనీతో పాటు ఆమె పీఏ రామకృష్ణ, జయ ఫణీంద్ర తో పాటు అప్పటి చిలకలూరిపేట అర్బన్ సీఐగా పనిచేసిన సూర్యనారాయణపైనా ఐటీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పల్నాడు జిల్లా ఐటీడీపీ చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరావు ఆరోపించారు. తనను ఐదు రోజులపాటు పోలీస్ స్టేషన్ లో అక్రమంగా నిర్భందించి చిత్రహింసలకు గుర్తిచేశారని తెలిపారు. ఈ సందర్భంగా... తమను చిత్రహింసలకు గురిచేస్తూ ఆ వీడియోలను వాట్సప్ లో విడదల రజనీ, ఆమె పీఏలకు పంపారని తెలిపారు.

కాగా... ఏపీ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రముఖులతోపాటు వారి కుటుంబ సభ్యులపైనా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే గతంలో తమను వేధించారని.. పోలీస్ స్టేషన్ చిత్రహింసలకు గురి చేశారని.. వాటికి సంబంధించిన దృశ్యాలు విడదల రజనీకి పంపారంటూ.. ఆమెతో పాటు పోలీసులపైనా ఎస్పీకి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News