ఎక్కడో దూరాన కూర్చున్నావు....ఇక్కడ మా తలరాతలు?
దాంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్యాడర్ కి అందుబాటులో ఉంటే వైసీపీ స్టోరీ వేరే లెవెల్ కదా అని అంటున్నారు.;

వైసీపీలో ఇదే చర్చ అని అంటున్నారు. అధినాయకుడు తీరు మీదనే వారు అంతా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మారిపోయారా అన్నది కూడా డౌట్ గా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఉండాల్సింది ఏపీలో. బ్రహ్మాండమైన ప్యాలెస్ లాంటిది తాడేపల్లిలో కట్టించుకున్నారు. ఆఫీసు కం నివాసం రెండూ అక్కడే. దాంతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్యాడర్ కి అందుబాటులో ఉంటే వైసీపీ స్టోరీ వేరే లెవెల్ కదా అని అంటున్నారు.
కానీ అధినాయకుడు మాత్రం ఎక్కడో దూరాన కూర్చున్నారు అని మదనపడుతున్నారు. కర్ణాటకలో జగన్ ఎహెలంక ప్యాలెస్ లోనే గడచిన పది నెలలుగా ఎక్కువ సమయం గడుపుతున్నారు. జగన్ తాడేపల్లికి ఎపుడు వస్తున్నారో ఎపుడు వెళ్తున్నారో ఎవరికీ తెలియడం లేదు.
ఇక కూటమి అధికారంలోకి వచ్చి పది నెలల సమయం దాటుతోంది. దాంతో జనంలో నెమ్మదిగా అసంతృప్తి అయితే ఉంది. టీడీపీ కచ్చితంగా 2024 ఎన్నికల్లో గెలుస్తుంది అని సర్వేలు చేసిన వారే పల్లెల్లో సూపర్ సిక్స్ హామీ విషయం అమలు కాకపోవడంతో దాని మీద జనంలో వ్యతిరేకత మొదలైంది అని కూడా నివేదికలు ఇస్తున్నారు.
వరస పండుగలు వస్తున్నాయి. చేతిలో నగదు కదలడం లేదన్న బాధ సగటు జనంలో ఏర్పడింది. ఇక కూటమి ప్రభుత్వం ప్రయారిటీస్ ప్రాధాన్యతల విషయంలో కూడా కొన్ని సెక్షన్లలో అయితే మెల్లగా సెగ మొదలైంది అని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో కనుక జగన్ రంగంలోకి దిగి జనంలోకి వెళ్తే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చేది అని అంటున్నారు.
అయితే జగన్ మాత్రం ఏపీ నుంచి దూరంగా జరిగిపోయారని అంటున్నారు. ఏప్రిల్ మే నెలలలో కొన్ని సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వాటిని కనుక అమలు చేస్తే అపుడు విపక్ష నేత జగన్ జనంలోకి వెళ్ళినా పెద్దగా ఉపయోగం ఉంటుందా అని కూడా అంటున్నారు.
మరో వైపు చూస్తూంతే కూటమి ప్రభుత్వం వైసీపీ క్యాడర్ ని వేధిస్తోందని వారి మీద దాడులు చేస్తోందని అయినా అధినాయకత్వం వీటిని పెద్దగా పట్టించుకోవడంలేదన్న బాధ ఉందిట. తాము ఎవరి కోసం కష్టపడుతున్నామో ఆ పార్టీ అధినాయకత్వమే నిర్లిప్తంగా ఉంటే ఎలా అని అంటున్నారు. తాము కూటమి ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడుతున్నామని వారు అంటున్నారు. తమకు కావాల్సింది తగిన ప్రోస్తాహం అని మేమున్నాం అని ధైర్యం చెప్పడం అని అంటున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైసీపీ మంచి ఫలితాలు రాబట్టింది. అయితే అలా ఫలితాలు సాధించిన వారిని పిలుపించుకొని స్వయంగా అధినేత అభినందిస్తే ఆ కిక్కే వేరుగా ఉండేదని అంటున్నారు. కానీ ఆ విధంగా కాకుండా కేవలం ట్వీట్ చేసి వదిలేశారు అన్న అసంతృప్తి వారిలో ఉందిట.
ఇక సంక్రాంతి తరువాత జనంలోకి వస్తాను అని జగన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఇపుడు చూస్తే ఉగాది కూడా పూర్తి అయిందని మరెప్పుడు జనంలోకి వస్తారు అని అంటున్నారు. 2009లో పాలిటిక్స్ లోనికి ఎంట్రీ ఎంపీ అయిన జగన్ ఇచ్చి 2011లో కాంగ్రెస్ ని వీడి వైసీపీని స్థాపించారని ఆ తరువాత 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు అయినా వెంటనే జనంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారు
కేవలం అయిదేళ్ళ రాజకీయ అనుభవం ఉన్నపుడే అంత దూకుడు చూపించిన అధినాయకత్వం ఇపుడు 15 ఏళ్ళ అనుభవం తరువాత ఎంత పదును తేరి ఉండాలని అంటున్నారు. జగన్ మారిపోయారా లేక ఆయన జనంలోకి రాకపోవడానికి వేరే వ్యూహం ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే కర్ణాటకలో జగన్ కొలువు తీరడం మాత్రం క్యాడర్ కి ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు.