ఎస్టీ నేతను బహిష్కరించారు.. మరి బీసీ నేత ఏమయ్యారు జగన్?
గతంలో న్యూడ్ వీడియోలు చేసిన.. అప్పటి అనంతపురం ఎంపీ, మాజీ సీఐ.. గోరంట్ల మాధవ్ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీవ్ర వివాదం అయింది.
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి.. నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. సామాజిక వర్గాల వారీగా ఆయన న్యాయం ఉంటోందన్న వాదన కూడా వినిపిస్తోంది. కొన్ని కొన్ని విషయాల్లో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నాయకులకు కూడా మింగుడు పడడం లేదు. గతంలో న్యూడ్ వీడియోలు చేసిన.. అప్పటి అనంతపురం ఎంపీ, మాజీ సీఐ.. గోరంట్ల మాధవ్ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీవ్ర వివాదం అయింది.
అయితే.. అప్పట్లో సదరు మాధవ్‌పై ఎలంటి చర్యలూ తీసుకోకపోగా.. ఆయనను వెనుకేసుకు వచ్చి.. సజ్జల రామకృష్ణారెడ్డి తూచ్.. అదంతా.. ఏమీ లేదు. మా ఎంపీ బంగారం అన్నట్టుగా మాట్టాడారు. జనాలు ఛీ కొట్టినా.. గోరంట్లను వెనుకేసుకువచ్చారు. దీనికి కారణం.. బీసీ అనే కార్డు వెనుక ఉండడమే అన్న విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మాత్రం.. స్పా ముసుగులో వ్యభిచారం.. కేసులో ఇరుకున్న ఎస్టీ నాయకుడు, వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్ పై వేటు వేశారు.
ఇటీవల విజయవాడలోని స్పా సెంటర్‌లో శంకర్ నాయక్ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ పార్టీ నుంచి ఆయనను వైఎస్ జగన్ బహిష్కరించారు. రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్ లో దొరికిపోయిన శంకర్ నాయక్.. ఏకంగా.. పోలీసుల రైడ్ సమయంలో మంచం కింద దూరారు. ఈ వీడియో జోరుగా వైరల్ కావడంతో శంకర్ నాయక్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ యన గతంలో వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడుగా పని చేశారు.
ఇప్పుడు తీసుకున్న చర్చ బాగానే ఉంది. కానీ, గతంలో ఏకంగా ఓ ఎంపీనే ఇలా న్యూడ్ వీడియోతో పట్టుబడి నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది ప్రశ్న. ఇది సామాజిక వర్గా లపరంగా జగన్ చెప్పే న్యాయానికి ఎలా సమర్థవంతంగా ఉంటుందని ఆయా సామాజిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. పైగా నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పే జగన్.. బీసీలకు ఒక న్యాయం,.. ఎస్టీలకు ఒక న్యాయం ఎలా పాటిస్తారని..నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.