5 టైటిళ్ల రోహిత్ ది గాయం కాదు.. ముంబై ఇండియన్స్ నుంచి వేటు?
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ చివరి మ్యాచ్ లో పక్కనపెట్టారు.;

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ చివరి మ్యాచ్ లో పక్కనపెట్టారు. ఇది వాస్తవానికి వేటు వేయడం. కానీ, రోహిత్ వంటి దిగ్గజ ఆటగాడిపై వేటు వేశారని చెప్పలేకపోయారు. ఆ సిరీస్ లో రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన రోహిత్ పేలవంగా ఆడాడు. దీంతో ఐదో టెస్టులో తప్పించారు.
వన్డే ఫార్మాట్లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ రోహిత్ గొప్పగా ఏమీ ఆడలేదు. అయితే, వన్డే కాబట్టి కాస్త మెరుగ్గా రాణించాడు అనుకోవాలి. మరోవైపు రోహిత్ గత కొంతకాలంగా ఫామ్ లో లేడు. నిరుడు జూన్ లో టి20 ప్రపంచ కప్ గెలిచాక ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ఇచ్చాడు.
ఐదు టైటిళ్ల కెప్టెన్ ఔట్?
తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై జట్టులో రోహిత్ కనిపించలేదు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయలేదు. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందా? అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
0, 8, 13 ఇవీ గత మూడు మ్యాచ్ లలో రోహిత్ స్కోర్లు. దీంతోనే లక్నోతో మ్యాచ్ లో పక్కనపెట్టినట్లు స్పష్టం అవుతోంది.
నెట్స్ లో మోకాలికి బంతి తగలడంతోనే రోహిత్ ను ఆడించలేదని చెబుతున్నారు. కానీ, అది వాస్తవం కాదు. ఎందుకంటే రోహిత్ ఫామ్ లో లేనందునే గత మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించారన్న సంగతి మర్చిపోవద్దు. సరే గాయమే అనుకున్నా.. అది చిన్నది కాబట్టి రోహిత్ తర్వాతి మ్యాచ్ కు అందుబాటులోకి రావాలి. కానీ, మరో రెండు మూడు మ్యాచ్ లకు కూడా రోహిత్ కష్టమే అంటున్నారు. దీన్నిబట్టి అతడిపై వేటు వేశారనే భావించాలి.