హిట్టర్ల సన్ రైజర్స్ ‘16’.. కావ్య పాపకు ఏడుపే తక్కువ..

ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.;

Update: 2025-04-07 07:45 GMT
హిట్టర్ల సన్ రైజర్స్ ‘16’.. కావ్య పాపకు ఏడుపే తక్కువ..

ఆటల్లో ఓటమి కాదు.. ఓడిన తీరు ఎలా ఉంది? అనేది చూస్తారు.. పోరాడి ఓడితే గెలిచిన జట్టు కంటే ఎక్కువ పేరు వస్తుంది.. ఇక ఎంతో అంచనాలు ఉండి.. దారుణంగా ఫెయిల్ అయితే అంతకుమించిన విమర్శలు మొదలవుతాయి.

ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తీరు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది.

ప్రత్యర్థి అడ్డాలో ఓటమి పాలైతే అది కాస్త సహంజ.. సొంత గడ్డపై ఎవరైనా సులువుగా గెలుస్తారు. కానీ, సన్ రైజర్స్ చేతులెత్తేస్తోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ 17వ ఓవర్ లోపే ఓడిపోయింది.

ఇక ఆదివారం సన్ రైజర్స్ కచ్చితంగా గెలుస్తుందని భావించారు. కారణం.. సొంత మైదానం ఉప్పల్ కు తోడు గుజరాత్ టైటాన్స్ వంటి ఓ మాదిరి జట్టు ప్రత్యర్థి కావడమే. కానీ, అంతకంతకు అన్నట్లుగా మరింత దారుణంగా పరాజయం పాలైంది.

విధ్వంసక ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మకు ఈసారి ఇషాన్ కిషన్ తోడైనందున సన్రైజర్స్ ఈసారి 300 కొడుతుంది అనుకుంటే 150 చాల్లే అన్నట్లుగా ఆడుతోంది. టాప్ ఆర్డర్ లోని ముగ్గురూ దారుణంగా విఫలం అవుతున్నారు. గుజరాత్ తో మ్యాచ్ లో అభిషేక్ (16 బంతుల్లో 18), ట్రావిస్ హెడ్ (5 బంతుల్లో 8) ముందుగానే ఔట్ అయిపోయారు.

తొలి మ్యాచ్ లో సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ మళ్లీ ఆ స్థాయి బ్యాటింగ్ చేయడమే లేదు. గుజరాత్ పై 14 బంతులు ఆడి 17 పరుగులే చేశాడు. 50 పరుగులకే ఈ ముగ్గురి వికెట్లు పడిపోయాయి.

కాగా.. తమ జట్టు ఆటతీరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ కు ఏడుపే తక్కువైంది. నెటిజన్లు ముద్దుగా ’కావ్య పాప‘ అంటూ పిలుచుకునే కావ్య మారన్.. సన్ రైజర్స్ ప్రతి మ్యాచ్ కు హాజరవుతుంటారు. ఆటగాళ్ల ప్రదర్శన సందర్భంగా కావ్య హడావుడి చేస్తుంటారు. అయితే, ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ తర్వాత కావ్యలో జోష్ కనిపించడం లేదు. గుజరాత్ తో మ్యాచ్ లో మరీ నిరాశకు గురయ్యారు. ’’ఏం చేస్తున్నారు వీరంతా? మరీ ఇంత ఘోరమైన బ్యాటింగా?’’ అన్నట్లుగా ఫేస్ మాడ్చేశారు. ఇప్పుడిదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News