జగన్ మోడీ సైడేనా...?

ఇండియా కూటమికి 232 మంది ఎంపీల బలం ఉంటే ఎన్డీయేకు 290కి పైగా ఎంపీల బలం ఉంది.

Update: 2024-06-25 11:23 GMT

లోక్ సభ స్పీకర్ కి అనూహ్యంగా ఎన్నికలు వచ్చిపడ్డాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా దేశ అత్యున్నత పార్లమెంట్ కి సంబంధించి సభాపతికి ఎన్నిక జరగబోతోంది. దాంతో ఎన్డీయే కూటమి నుంచి మాజీ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అలాగే ఇండియా కూటమి నుంచి కేరళకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కె సురేష్ ఉన్నారు.

ఇండియా కూటమికి 232 మంది ఎంపీల బలం ఉంటే ఎన్డీయేకు 290కి పైగా ఎంపీల బలం ఉంది. అయితే న్యూట్రల్ గా ఉన్న పార్టీలు ఈ ఎన్నికల్లో ఎటు వైపు అన్న చర్చ ముందుకు వస్తోంది. వైసీపీ న్యూట్రల్ గా ఉంది. అటు ఎన్డీయే స్టాండ్ కానీ ఇటు ఇండియా స్టాండ్ కానీ తీసుకోకుండా ఉంది.

లోక్ సభలో ఎన్డీయేకు నలుగురు ఎంపీల బలం ఉంది. హోరా హోరీగా సాగే ఈ పోరులో ఇండియా కూటమి న్యూట్రల్ పార్టీల మీద ఆశలు పెట్టుకుంది. అదే విధంగా బీజేపీ సొంత బలం 240 అనే చూస్తోంది. ఆ మిగిలిన ఓట్లు ఎటు నుంచి ఎటు అయినా మారుతాయని ఆశిస్తోంది.

స్పీకర్ పదవికి తీసుకుంటే టీడీపీకి మోజు ఉంది. అలాగే జేడీయూ కూడా కోరింది. కానీ వీరిని కాదని తమ వారికే బీజేపీ చాన్స్ ఇచ్చింది. దాంతో ఎన్డీయే మిత్రులలో అసంతృప్తి ఏమైనా ఉండొచ్చు అని భావిస్తోంది. అయితే ఇంత తొందరగా ఎన్డీయే కూటమి మిత్రులు బయట పడకపోవచ్చు.

అయితే ఇండియా కూటమి ఆశించినట్లుగా ఒడిషా నుంచి బిజూ జనతాదళ్ కి ఉన్న ఏకైక ఎంపీ, అలాగే వైసీపీల మద్దతు మరికొన్ని చిన్న పార్టీలను నమ్ముకుంది. స్పీకర్ ఎన్నికల్లో గెలవడానికే ఇండియా కూటమి చూస్తుంది. ఒక వేళ కాకపోయినా తనకు వచ్చే ఓట్ల నంబర్ ని ముందుంచి మోడీ సర్కార్ ని భయపెట్టడానికి చూస్తుంది.

రానున్న రోజులలో స్ట్రాంగ్ అపోజిషన్ గా ఉండడానికి చూస్తుంది. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదని ఇండియా కూటమి చూస్తుంది. మరి వైసీపీ పొలిటికల్ స్టాండ్ ఏంటి అన్నది చూడాలి. ఏపీలో ఎన్డీయే కూటమి కట్టి జగన్ ని గద్దె దింపింది బీజేపీ. ఇపుడు అందులో టీడీపీ జనసేన ఉన్నాయి.

ఆ పార్టీతో పాటుగా ఎన్డీయే కూటమికి వైసీపీ మద్దతు ఇస్తుందా అన్నది ఒక ప్రశ్న. అలా వీలు కాకపోతే ఇండియా కూటమికి మద్దతుగా నిలుస్తుందా అంటే అసలు చెప్పలేని పరిస్థితి. వైసీపీ అయితే ఈ రెండూ కాకుండా మరో మార్గం ఎంచుకునే వీలు ఉంది అని అంటున్నారు.

అదేంటి అంటే ఓటు వేయకుండా మౌనంగా ఉండిపోవడం. అలా చేసినా ఇండైరెక్ట్ గా ఎన్డీయే కూటమికే లాభం. అయినా సరే డైరెక్ట్ గా టీడీపీ జనసేన ఉన్న ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వకుండా ఈ రూటే బెటర్ అని వైసీపీ అనుకుంటే మాత్రం ఇండియా కూటమిని నిరాశే. కానీ ఫ్యూచర్ పాలిటిక్స్ ని దృష్టిలో ఉంచుకుని వైసీపీ ఇదే చేస్తుందని అంటున్నారు.

ఎందుకంటే ఇవాళ ఉన్న రాజకీయం రేపు ఉండకపోవచ్చు. అందువల్ల ఎన్డీయేకు దూరంగా కాకుండా దగ్గర కాకుండా వైసీపీ తన వైఖరిని స్పీకర్ ఎన్నిక వేళ బయటపెట్టవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News