అంతరిక్షానికి వెళ్లినా ఆగని వేధింపులు... ఇచ్చిపడేసిన మహిళా ఆస్ట్రోనాట్!

వివరాళ్లోకి వెళ్తే.. జెఫ్ బెజోస్ కు చెందిన "బ్లూ ఆరిజిన్" ఇటీవల రోదసి యాత్ర నిర్వహించింది. దీని ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన 100వ మహిళగా ఎమిలీ కాలండ్రెల్లీ అనే ఇంజినీర్ రికార్డుకెక్కారు.

Update: 2024-11-27 22:30 GMT

సంకుచిత మనస్తత్వం, వంకర బుద్ది విషయంలో కొంతమంది పురుషుల ఆలోచనా విధానం మారడం లేదు. మహిళలపై ఆన్ లైన్ వేదికగా పనికిమాలిన కామెంట్లు పెట్టడాన్ని హీరోయిజంగా భావిస్తుంటారో ఏమో కానీ.. తాజాగా ఓ మహిళా ఆస్ట్రోనాట్ లక్ష్యంగా తప్పుడు కామెంట్లు చేశారు. దీనిపై ఆమె స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.

అవును... ఏనుగు నడుస్తున్నప్పుడు కుక్కలు మొరుగుతాయన్నట్లుగా కొంతమంది మహిళల విషయంలో కొంతమంది పురుషులు ఆన్ లైన్ వేదికగా తప్పుడు కామెంట్లు చేస్తుంటారు. ఈ విషయంలో.. అంగడి వద్ద కనిపించిన అమ్మాయి, అంతరిక్షానికి వెళ్లిన మహిళ అనే తారతమ్యాలేవీ లేకుండా ఉంటున్నాయి. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే.. జెఫ్ బెజోస్ కు చెందిన "బ్లూ ఆరిజిన్" ఇటీవల రోదసి యాత్ర నిర్వహించింది. దీని ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన 100వ మహిళగా ఎమిలీ కాలండ్రెల్లీ అనే ఇంజినీర్ రికార్డుకెక్కారు. ఈ సమయంలో ఆమె అంత ఎత్తు నుంచి భూమిని చూడటంపై ఎంతో ఆనందం వక్తం చేశారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

వాస్తవానికి ఏ మహిళకైనా తాను తల్లి అయినప్పుడు కలిగిన సంతోషం, ఆ అనుభూతిని పోలిన అనుభూతిని తన జీవిత కాలంలో అత్యంత అరుదుగా పొందుతారని అంటారు. ఈ క్రమంలో.. .తాను భారతహిత స్థితిలో ఉండి.. తలకిందులుగా భూమిని చూసినప్పుడు ఎంతో ఆనందం వేసిందని.. తనకు పిల్లలు పుట్టినప్పుడు ఎలాంటి అనుభూతి చెందానో.. ప్రస్తుతం అలానే అనిపించిందని రాసుకొచ్చారు.

ఈ సందర్భంగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. అయితే.. కొంతమంది మాత్రం ఆ మహిళా వ్యోమగామిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. బాడీ షేమింగ్ చేస్తూ అభ్యంతరకర, అసభ్యకర పోస్టులు పెట్టారు. దీంతో... సంబంధిత వీడియోను తొలగించడంతో పాటు ఆమె ఈ కామెంట్లపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇందులో భాగంగా... తన జీవితంలో పొందిన అత్యంత విలువైన అనుభవమిదని.. అయితే, భూమికి తిరుగు ప్రయాణంలో ఉండగా నెట్టింట తనపై వచ్చిన కామెంట్లు చూస్తే కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా సంకుచిత మనస్తత్వం కలిగిన పురుషులను పట్టించుకునే సమయం తనకు లేదంటూ స్ట్రాంగ్ గా ఇచ్చిపడేశారు.

Tags:    

Similar News