4 రోజుల నరకం.. 40 రోజుల జైలు కర్కశత్వం
ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టమని ఒత్తిడి చేవారు" ముంబయి సినీ నటి కాదంబరి జెత్వానీ తాజాగా సీఐడీ అధికారులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
"భూమి గురించి నాకేమీ తెలీదని మొత్తుకున్నా.. అయినా వినలేదు. ఒక ఆడ పోలీసు చెంప మీద కొట్టటమేకాదు.. జుట్టు పట్టి లాగి పడేశారు. చుట్టూ మగ పోలీసులతో తీవ్ర ఇబ్బంది పెట్టారు. భయపెట్టారు. బెదిరింపులకు దిగారు. నేనేం తప్పు చేశానో చెప్పమంటే చెప్పేవారు కాదు. ఫోన్లు.. ల్యాప్ టాప్ లాక్కొని ఏకాకిని చేశారు. లాయర్ తో మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టమని ఒత్తిడి చేవారు" ముంబయి సినీ నటి కాదంబరి జెత్వానీ తాజాగా సీఐడీ అధికారులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
తనపై తప్పుడు కేసులు పెట్టటమే కాదు తీవ్రంగా వేధింపులకు దిగిన వైనంపై ఆమె ఓపెన్ అయ్యారు. ఏపీలోని మంగళగిరిలోని సీఐడీ అధికారుల ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ముంబయి నుంచి తనను బలవంతంగా బెజవాడకు తీసుకొచ్చి వేధింపులకు గురి చేసిన ఐపీఎస్ అధికారుల కర్కశత్వాన్ని ఆమె వివరించారు. నటి జెత్వానీపై భూఆక్రమణ కేసు నమోదు చేసి బలవంతంగా ఆమెను ముంబయి నుంచి విజయవాడకు తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా మారిన కుక్కల విద్యాసాగర్ కు సంబంధించిన పలు అంశాల్ని జెత్వానీ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. కుక్కల విద్యాసాగర్ తో ఉన్న వైరం ఏమిటి? ఆయన నుంచి ఎలాంటి వేధింపులు వచ్చాయి? ఆయనకు మీపై ఎందుకంత కోపం? లాంటి ప్రశ్నల్ని సంధించగా సమాధానాలు ఇచ్చినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారంలో నాటి ఇంటెలిజెన్స్చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు.. విజయవాడ సీపీ కాంతి రాణా.. డీసీప విశాల్ గున్నీ పాత్రల గురించి వెల్లడించారు. ఇప్పటికే ఈ అధికారుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేయటం తెలిసిందే.