అల్లు అర్జున్ అరెస్ట్ కక్షసాధింపు!... వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!

దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ మొదలైన వారు క్లారిటీ ఇస్తున్నా.. జరగాల్సిన చర్చ జరుగుతూనే ఉందనే చర్చ జరుగుతుందని అంటున్నారు.

Update: 2024-12-15 11:46 GMT
అల్లు అర్జున్ అరెస్ట్ కక్షసాధింపు!... వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!
  • whatsapp icon

అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ మొదలైన వారు క్లారిటీ ఇస్తున్నా.. జరగాల్సిన చర్చ జరుగుతూనే ఉందనే చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్ అరెస్ట్ ను తెలంగాణలో బీఆరెస్స్ నేతలు తప్పుపట్టగా.. ఏపీ నుంచి ప్రధానంగా వైసీపీ తీవ్రంగా ఖడించింది. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ అరెస్ట్ ను అంబటి రాంబాబు ఖండించడంతో పాటు దాన్ని కొనసాగిస్తూ మరికొన్ని ట్వీట్లు చేశారు. ఇందులో భాగంగా.. "గురువు ఆజ్ఞ.. శిష్యుడు అమలు.. అల్లు అర్జున్ అరెస్టు.. నా మాట కాదు.. ఇది జనం మాట!"

అని ఓ ఆసక్తికర ట్వీట్ చేసిన అంబటి.. తాజాగా "బన్నీ" ని బందిస్తే!! "గబ్బర్ సింగ్" గమ్మునున్నాడెందుకు?? అంటూ మరో సందేహం తెరపైకి తెచ్చారు. ఇక ప్రధానంగా... వైసీపీ అధినేత జగన్... అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత కన్నబాబు.. అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును.. అల్లు అర్జున్ అరెస్ట్ ను ఖండిస్తూ అధినేతతో పాటు పలువురు వైసీపీ నేత్లు స్పందించిన నేపథ్యంలో తాజాగా వైసీపీ నేత, మాజీమంత్రి కన్నబాబు స్పందించారు. ఇందులో భాగంగా... ఈ అరెస్టు నూటి నూరుశాతం ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన కక్ష సాధింపులా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... అల్లు అర్జున్ ని నాలుగు రోజులు జైల్లో ఉంచాలని చూసినట్లుగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం.. తొక్కిసలాట సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదా అని ప్రశ్నించిన కన్నబాబు.. ఈ విషయంలో ఏపీలో ఒక చట్టం, తెలంగాణలో మరో చట్టం అమలవుతోందని అన్నారు.

ఈ సందర్భంగా... గత గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఆనాడు చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనడబలేదని చెప్పిన కన్నబాబు.. అప్పుడాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు. ఇక.. ఈ అరెస్టు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని అన్నారు!

Tags:    

Similar News