బిగ్ బ్రేకింగ్... కవితకు మరో బిగ్ షాక్!
దీంతో... ఈ వ్యవహారంలో రాజకీయపరమైన చర్చ పీక్స్ కి చేరింది. పైగా.. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది మరింత వైరల్ గా మారింది
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆప్ పార్టీలోని కీలక నేతలతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్టైన సంగతి తెలిసిందే. దీంతో... ఈ వ్యవహారంలో రాజకీయపరమైన చర్చ పీక్స్ కి చేరింది. పైగా.. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది మరింత వైరల్ గా మారింది.
ఈ సమయంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అవ్వడం తెలిసిందే! ఈ సమయంలో తన చిన్నకుమారుడు పరీక్ష రీత్యా మద్యంతర బెయిల్ కు దరఖాస్తు చేసినా కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. ఇదే సమయంలో.. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఈ కేసుకు సంబంధించిన కవిత విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరింత దూకుడు పెంచింది. ఇదే సమయంలో.. ఈ కేసులో అరెస్ట్ అయిన బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన కవితకు ఎదురు దెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అరెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ కవితకు మరో షాకిచ్చింది. ఈ సమయంలో కవితను సీబీఐ 10 రోజుల కస్టడీని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.