అన్నదమ్ముల కోసం కాదు.. ప్రజల కోసం పనిచేయండి.. కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు నిరూపిస్తే ఏకంగా పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.

Update: 2024-12-21 11:30 GMT

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సభా వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు నిరూపిస్తే ఏకంగా పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.

ఈ రోజు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రైతురుణమాఫీపై రైతుల వద్దకు వెళ్లి అడుగుదామని, వందశాతం పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చాలెంజ్ చేశారు. కొండారెడ్డిపల్లి, పాలేరు.. ఇంకా ఎక్కడికంటే అక్కడికి వెళ్దామని.. నిరూపించాలని అన్నారు. వంద శాతం పూర్తయినట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు.

అలాగే.. రైతుబంధుపై సమగ్ర విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు భరోసాను ప్రారంభించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రైతుబంధు అమలు చేయడంతోనే విస్తీర్ణం పెరిగిందని వెల్లడించారు. రైతుబంధుపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ఒక పంటకు ఇస్తారా.. లేక రెండు పంటలకు ఇస్తారా.. అనేది క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అదానీ కోసం కొడంగల్ రైతులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలులో పెట్టారని కేటీఆర్ మండిపడ్డారు. కేవలం అనుముల కుటుంబం కోసం.. ఆయన బామ్మర్ది కోసం.. అన్నదమ్ముల కోసమే పనిచేయకండి అని హెచ్చరించారు. అన్నదాతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పనిచేయాలన్నారు. 60శాతం మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పారు. కోతలు పెడితే అది మీ ఇష్టమని పేర్కొన్నారు. ఇక.. కౌలు రైతుల విషయంలోనూ స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ఇస్తారా లేదా అన్న క్లారిటీ ఇవ్వాలన్నారు.

Tags:    

Similar News