వైరల్ పిక్స్: అంతరిక్షం నుంచి కుంభమేళా... ఉంటుంది ఇలా!

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా వైభవోపేతంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే.

Update: 2025-01-27 11:08 GMT

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా వైభవోపేతంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివస్తున్నారు. ఇప్పటికే కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమం జనవరి 13 నుంచి 45 రోజులపాటు జరగనుంది.

ఇక ఈ కార్యక్రమానికి విచ్చేస్తోన్న భక్తులకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు, భద్రతా చర్యలు కల్పించింది! ఈ మహా కుంభమేళా పూర్తయ్యేలోపు కనీసం 40 కోట్ల మంది హాజరవుతారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఈ మాహా కుంభమేళాను అంతరిక్షం నుంచి చూసిన వ్యోమగామి డొనాల్డ్ పెటిట్ ఆ ఫోటోలు ‘ఎక్స్’ లో పంచుకున్నారు.

అవును... ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాను అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుందో చూపించారు నాసా వ్యోమగామి డోనాల్డ్ పెటిల్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి కనిపిస్తున్న కుంభమేళా దృశ్యాలను ఫోటో తీశారు. అనంతరం వాటిని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

దీనికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ.. గంగానది వద్ద జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమ్మేళనం మహా కుంభమేళా - 2025 రాత్రి సమయంలో అంతరిక్ష కేంద్రం నుంచి వెలుగులీనుతోంది అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు "హర హర మహదేవ్" అని స్పందిస్తున్నారు.

మరోపక్క... భారతదేశంలో జరుగుతున్న ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా, రష్యా, జపాన్, ఉక్రెయిన్, కెనడా, నెదర్లాండ్, కామెరూన్, స్విట్జర్లాండ్, పోలాండ్, బొలీవియా, స్వీడన్ మొదలైన 73 దేశాల దౌత్యవేత్తలు తొలిసారి ఇక్కడకి రానున్నారు. వీరంతా.. ఫిబ్రవరి 1న త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ మేరకు యూపీ సీఎస్ కు విదేశాంగ మంత్రిత్వశాఖ లేఖ రాసింది.

Tags:    

Similar News