టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ.. కమ్మల్లో చీలిక.. ?
రాజకీయాల్లో పార్టీలు మారడం.. జంపింగులు చేయడం నాయకులకు సహజం. అయితే.. కొన్ని కొన్ని సం దర్భాల్లో ఇవి వికటించే అవకాశం ఉంటుంది.
రాజకీయాల్లో పార్టీలు మారడం.. జంపింగులు చేయడం నాయకులకు సహజం. అయితే.. కొన్ని కొన్ని సం దర్భాల్లో ఇవి వికటించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో పార్టీలు చాలా జాగ్రత్తగా అడుగులు వేయా లి. తాజాగా టీడీపీలోకి చేరేందుకు రెడీ అయిన... ఓ వైసీపీ ఎమ్మెల్సీ విషయంలో సామాజిక వర్గాల పరంగా చీలిక వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. ఈ విషయం టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారడం గమనార్హం.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందని మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ వైసీపీ నాయకుడు మర్రి రాజశేఖర్.. టీడీపీలోకి జంప్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇటీవల జగన్ నిర్వహించిన సమావేశానికి కూడా.. ఆయాన గైర్హాజరయ్యారు. దీనిని బట్టి.. మర్రి ఏ క్షణమైనా సైకిల్ ఎక్కడం ఖాయమని అంటున్నారు. అయితే.. ఈ విషయంలో స్థానిక కమ్మ సామాజిక వర్గంలో చీలిక ఏర్పడే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది.
దీనికి కారణంగా.. ఓ ఎంపీ.. వర్సెస్ సీనియర్ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న వివాదాలేనని తెలుస్తోంది. సదరు ఎంపీ.. తననియోజకవర్గంలో వేలు పెట్టడాన్ని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు. దీనిపై ఇప్పటి కే రెండు మూడు సార్లు పంచాయతీ కూడా జరిగింది. అయినా.. కూడా అభివృద్ధి పనుల పేరుతో ఎంపీ తరచుగా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అంతేకాదు.. తన వారిని దూరం చేసే ప్రయత్నాలు చేస్తసున్నారని ఎంపీపై ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నారు.
ఈ పరిణామాల క్రమంలోనే.. ఎమ్మెల్సీ మర్రి.. ఎంపీ కనుసన్నల్లో ముందుకు రావడం.. సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడడం వంటివి .. ఎమ్మెల్యే కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అందుకే.. మర్రిని చేర్చుకోవద్ద ని తనదైన శైలిలో ఆయన పార్టీకి చెబుతున్నారు. ఇక, కమ్మ సామాజిక వర్గంలోనూ.. ఎమ్మెల్యే వైపు కొంద రు నిలబడగా.. మర్రి వస్తే తప్పేంటని అంటున్నవారు కూడా ఉన్నారు. అంటే.. వీరంతా ఎంపీ వర్గంగా ఉన్నారు. దీంతో మర్రి ఎంట్రీ ఆలస్యమవుతోంది.