టాప్‌ లెస్ బాడీచెక్‌... మిస్ యూనివర్స్ ఇండోనేషియా!

ఇందులో భాగంగా తాజాగా తమను టాప్ లెస్ గా బాడీలు చెక్ చేశారని, లోదుస్తులు తీసి ఫోజులు ఇవ్వమన్నారని ఆరోపణలు వస్తున్నాయి

Update: 2023-08-10 17:30 GMT

అందాల పోటీలపై ఎవరికి ఉన్న అభిప్రాయం వారికి ఉందనేది వాస్తవం. ఈ పోటీల్లో పలురకాల లైంగిక వేదింపులు జరిగాయనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా తమను టాప్ లెస్ గా బాడీలు చెక్ చేశారని, లోదుస్తులు తీసి ఫోజులు ఇవ్వమన్నారని ఆరోపణలు వస్తున్నాయి.

తాజాగా మిస్ ఇండోనేషియా యూనివర్స్ అందాల పోటీకి చెందిన పోటీదారులు ఈ మేరకు నిర్వాహకులపై కీలక ఆరోపణలు చేశారు. అవును... మిస్ ఇండోనేషియా యూనివర్స్ నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆరుగురు పోటీదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోటీ సమయంలో తాము టాప్‌ లెస్ "బాడీ చెక్"లకు గురయ్యామని పోటీదారులు ఆరోపించారు. ఇదే సమయంలో ఒకరు తన కాళ్లను ఎడం చేయడం ద్వారా అనుచితంగా పోజులివ్వమని అడిగారని చెప్పారు. దీంతో... పోటీదారులు నివేదికను సమర్పించారని, దానిని విచారిస్తామని పోలీసులు ధృవీకరించారు.

కాగా... మిస్ ఇండోనేషియా యూనివర్స్ అందాల పోటీలు రాజధాని జకార్తాలో జులై 29 నుండి ఆగస్టు 3 వరకు జరిగిన సంగతి తెలిసిందే. పురుషులతో సహా 20 మంది కంటే ఎక్కువ మంది ఉన్న గదిలో ఫిజికల్ చెక్కింగ్ కోసం ఐదుగురిని లోదుస్తులను విప్పమని నిర్వాహకులు కోరారని పోటీదారులు ఆరోపించారు.

ఈ క్రమంలో మిస్ యూనివర్స్ పోటీకి సంబంధించి నిర్వాహకులు స్పందించారు. ఈ ఆరోపణలపై తమకు అవగాహన వచ్చిందని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇదే సమయంలో ఈ ఆరోపణలను మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ చాలా సీరియస్‌ గా తీసుకుంటుందని అన్నారు.

ఇదే సమయంలో ఈ ఫిర్యాదులపై జకార్తా పోలీసు ప్రతినిధులు స్పందించారు. ఇందులో భాగంగా... పోటీదారుల నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరుపుతామని చెప్పారు.

కాగా... గతంలో ఇండోనేషియాలోని పలు మత సంఘాలు అందాల పోటీలపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క.. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ఇండోనేషియానే కావడం గమనార్హం.

Tags:    

Similar News