'రాజ్యాంగం'పై చ‌ర్చ‌.. కాంగ్రెస్‌.. కెలికి తిట్టించుకోవ‌డ‌మేనా?!

అయితే.. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రిం చుకుని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్ష పార్టీలు.. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ.. రెండురోజుల పాటు రాజ్యాంగంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతున్నాయి.

Update: 2024-12-02 17:30 GMT

భార‌త రాజ్యాంగానికి గ‌త నెల న‌వంబ‌రు 26తో 75 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి. రాజ్యాంగ స‌భ భార‌త రాజ్యాంగాన్ని ఆమోదిం చింది అదే రోజు కావ‌డంతో 75 వ‌సంతాల వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించుకున్నారు. అయితే.. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రిం చుకుని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్ష పార్టీలు.. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ.. రెండురోజుల పాటు రాజ్యాంగంపై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌డుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో అదానీ లంచాల వ్య‌వ‌హారం స‌హా.. మ‌ణిపూర్ అల్ల‌ర్లు, బంగ్లాదేశ్‌లో హిందువుల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై చ‌ర్చ‌కుప‌ట్టుబ‌డుతూ.. ప్ర‌తిపక్షాలు ఆందోళ‌న చేస్తున్నాయి.

ఈ క్ర‌మంల‌నే శీతాకాల స‌మావేశాల్లోనూ ఉభ‌య స‌భ‌లు వేడివేడిగా సాగుతున్నాయి. చ‌ర్చ‌లు, స‌భా కార్య‌క్ర‌మాలు కూడా నిలిచిపోతున్నాయి. ఈ క్ర‌మంలో విప‌క్షాలకు సంబంధించి ఈ ప్ర‌ధాన డిమాండ్ల‌కు ప్ర‌బుత్వ ప‌క్షం ఎక్క‌డా ఆమోదించడంలేదు. కానీ, ఈ డిమాండ్ల‌కుతోడు మ‌రో డిమాండ్‌గా ఉన్న ''రాజ్యాంగంపై చ‌ర్చ‌''కు మాత్రం తాజాగా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌లు ఓకే చెప్పాయి. దీనికిసంబంధించి డేట్లు కూడాఫిక్స‌య్యాయి. ఈ నెల 13, 14 తేదీల్లో లోక్‌స‌భ‌లోను, 16, 17న రాజ్య‌స‌భ‌లోనూ రాజ్యాంగంపై చ‌ర్చించేందుకు ఉభ‌య స‌భ‌లు అంగీక‌రించాయి. ఈ మేర‌కు తాజాగా ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో అంగీకారం తెలిపాయి.

అయితే.. ఈ చ‌ర్చ‌ల అనంత‌రం.. ఉభ‌య స‌భ‌ల్లోనూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సుదీర్ఘంగా ప్ర‌సంగించ‌నున్నారు. ఇదీ.. ఇప్పుడు అస‌లు చ‌ర్చ‌. వాస్త‌వానికి రాజ్యాంగంపై చ‌ర్చ‌ను కోరుకుంటున్న ప్ర‌తిప‌క్షాలు.. మోడీ హ‌యాంలో రాజ్యాంగం ప‌త‌న‌మైంద‌ని.. హ‌క్కులు కాల‌రాస్తున్నార‌ని, రాజ్యాంగం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించాల్సిన వ్య‌వ‌స్థ‌ల‌ను త‌న గుప్పిట పెట్టుకుంటున్నార‌ని కూడా.. వారు చెబుతున్నారు. పార్ల‌మెంటు వేదిక‌గా.. ఈ విష‌యాల‌ను ప్ర‌స్తావించి.. మోడీని ఎండ‌గ‌ట్టాల‌న్న‌ది వారి అభిప్రాయం. ఇది త‌ప్పుకాక‌పోవ‌చ్చు. కానీ, ఈ విష‌యంలో మోడీ దూకుడు మ‌రోవిధంగా ఉండే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు విప‌క్షాలు చేప‌ట్టిన అనేక చ‌ర్చ‌ల్లో మోడీ అనేక పాత అంశాల‌ను లేవ‌నెత్తారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ, నెహ్రూ పాల‌న‌ను ఆయ‌న పార్ల‌మెంటు వేదిక‌గా ప‌దే ప‌దే దుయ్య‌బ‌డుతున్నారు. ఇప్పుడు మోడీకి విప‌క్షాల కూట‌మి మ‌రింత అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. ఎందుకంటే.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను ఓడించింది.. ఆయ‌న‌ను వేధించింది కాంగ్రెస్ పార్టీనేన‌ని.. ఇటీవ‌ల జ‌రిగిన మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనే మోడీ చెప్పుకొచ్చారు. ఇదేస‌మ‌యంలో ఇందిర‌మ్మ ప్ర‌వేశ పెట్టిన ఎమ‌ర్జెన్సీ హ‌యాంలోనే.. ఆర్టిక‌ల్ 42 ద్వారా.. రాజ్యాంగ స్వ‌రూపం మార్చార‌ని, సామ్య‌వాద‌, లౌకిక ప‌దాల‌ను చేర్చార‌ని కూడాబీజేపీ ఆరోపిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో రాజ్యాంగంపై చ‌ర్చ అంటే.. మోడీ ని కెలికి మ‌రీ నాటి విష‌యాల‌పై తిట్టించుకోవ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News