సౌదీలోనూ యోగా ఉంది కానీ... మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు!
దేశంలోని ప్రతి పౌరుడు యోగా తప్పనిసరిగా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దేశంలోని ప్రతి పౌరుడు యోగా తప్పనిసరిగా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. యోగా వల్ల వ్యక్తి శారీరకంగానూ, మానసికంగానూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు! అయితే యోగాపై మోడీ ప్రకటన అనంతరం ఇది కేవలం హిందూ సంప్రదాయం అనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో... ఈ వ్యవహారంపై తాజాగా మోడీ తనదైన శైలిలో స్పందించారు.
అవును... దేశంలోని ప్రతీ పౌరుడూ తప్పనిసరిగా యోగా చేయాలని ప్రధాని సూచించిన సమయంలో... సూర్య నమస్కారం హిందూ సంప్రదాయమని చెబుతూ పలువురు ముస్లిం నాయకులు దీనిని ముస్లిం వ్యతిరేక చిత్రంగా ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా ఈ అంశంపై స్పందింస్తూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన మోడీ... తాను ఇటీవలి కాలంలో చాలా గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు.. ఆ దేశాల నుండి చాలా మంది మిలియనీర్లు తనను యోగా గురించి అడిగినట్లు చెప్పారు. ఇందులో భాగంగా... "మోదీ జీ, మనం నిజంగా యోగాను మంచి మార్గంలో ఎలా నేర్చుకుంటాము?.. నా భార్య ఒక నెల ఇండియా వెళ్లి నేర్చుకుందామనుకుంటుంది!" అని తనను అడిగారని.. యోగాపై అంతటి ఆసక్తి ప్రపంచ దేశాల్లోని ప్రజల్లో ఉందని మోడీ వెల్లడించారు.
ఇదే క్రమంలో... ముస్లిం దేశం సౌదీలో వారు యోగాను పాఠ్యాంశంగా మార్చారని చెప్పిన మోడీ... ఇక్కడ మాత్రం భారతీయ ముస్లింలు దానిని ముస్లిం వ్యతిరేక కార్యక్రమంగా పేర్కొంటున్నారని అన్నారు. యోగాను ఇప్పటికీ చాలామంది హిందూ - ముస్లిం విషయంగా చూస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో తాను ముస్లింలను హృదయపూర్వకంగా ఒక విషయం అడగాలనుకుంటున్నట్లు చెప్పిన మోడీ.. కీలక విషయాలు తెరపైకి తెచ్చారు.
ఇందులో భాగంగా... "మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి కానీ మరేమీ కాదు.. ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం నా ముస్లిం సోదరీమణులకు నేను వారి పట్ల ఎంత నిజాయితీగా ఉన్నానో వివరిస్తుంది.. రామమందిరాన్ని నిర్మించడం, ఆర్టికల్ 370 రద్దు చేయడం ఎప్పటినుంచో బీజేపీ మేనిఫెస్టోలో ఉంది.. ఆ హామీని తాము నెరవేర్చాము" అని మోడీ వివరించారు!