సంచలనం... ఈ యూట్యూబ్ ఛానల్ కు 300 మిలియన్ల సబ్ స్క్రైబర్స్!

ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న ఛానల్ గా రికార్డ్ సృష్టించిన మిస్టర్ బీస్ట్... తాజాగా మరో సంచలనం సృష్టించింది

Update: 2024-07-11 16:30 GMT

ప్రపంచంలోనే అత్యధిక సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న ఛానల్ గా రికార్డ్ సృష్టించిన మిస్టర్ బీస్ట్... తాజాగా మరో సంచలనం సృష్టించింది. ఇందులో భాగంగా... తాజాగా ఆ ఛానల్ 300 మిలియన్ల సబ్ స్క్రైబర్లను చేరుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఈ ఛానల్ యజమాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

అవును... 10 జూలై 2024న అత్యధిక సబ్ స్క్రైబర్స్ ఉన్న ఛానల్ గా పేరు సంపాదించుకున్న ఇండియన్ మ్యూజికల్ దిగ్గజం టీ-సిరీస్ (260 మిలియన్లు) ను అధిగమించిన నెల రోజుల్లోనే... మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ ఛానల్ 300 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ తో ప్రపంచంలోనే ఇంతమంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఛానల్ గా రికార్డ్ కెక్కింది.

ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన డొనాల్డ్ సన్... 300 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్న స్క్రీన్ షాట్ ను పంచుకున్నారు. ఈ సందర్భంగా... "నేను 11 సంవత్సరాల క్రితం 300 మంది సబ్ స్క్రైబర్స్ ని టచ్ చేసినప్పుడు ఆశ్చర్యపోయాను" అని పేర్కొన్నారు. అంటే... 11 ఏళ్ల క్రితం ఉన్న 300 కాస్తా ఇప్పుడు 300 మిలియన్లు అయ్యిందన్నమాట.

దీంతో... మిస్టర్ బీస్ట్ అభిమానులు కామెంట్ బాక్స్ ను శుభాకాంక్షలు, అభినందనలతో నింపేస్తున్నారు. దీంతో స్పందించిన బీస్ట్... ఈ రోజు తాను 50 మంది అదృష్ట విజేతలను ఆశీర్వదిస్తానని.. ఈ సమయంలో మీకు ఎంత అవసరమో చెప్పండి అని అడుగుతూ.. గరిష్టంగా %5,00,000 అని తెలిపారు.

Tags:    

Similar News