హరీశ్ కు దమ్ముంటే రాజీనామా చేసి మైనంపల్లిపై పోటీ చేయాలట

చాలా అరుదైన సన్నివేశం సిద్ధిపేట పట్టణంలో కనిపించింది. రోటీన్ కు భిన్నంగా సిద్ధిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2024-08-21 04:46 GMT

చాలా అరుదైన సన్నివేశం సిద్ధిపేట పట్టణంలో కనిపించింది. రోటీన్ కు భిన్నంగా సిద్ధిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు.. సిద్ధిపేటను హాట్ హాట్ గా మారాయి. దీనికి తోడు.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లు పోటాపోటీ ర్యాలీలకు పిలుపునివ్వటంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకంది. ఇరు పార్టీల నేతలు.. కార్యకర్తలు ఈ ప్రోగ్రాంను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటంతో పోటాపోటీగా పాల్గొనటంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ నేతలు గుండాల మాదిరి వ్యవహరిస్తున్నారని.. తాము ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాము బీఆర్ఎస్ పైనో.. హరీశ్ రావు పైనో కాదని.. గులాబీ గుండాలకు వ్యతిరేకంగా గళం విప్పాలనుకుంటున్నట్లుగా కాంగ్రెస్ వాదులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఉద్రిక్త సీన్లోకి కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఎంట్రీ ఇచ్చారు.

తాము చేపట్టే ర్యాలీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ క్యాడర్ ప్రయత్నిస్తోందని.. హరీశ్ రావు వర్గీయులు పోటాపోటీగా ర్యాలీ చేపట్టిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. వారి అంతు చూసే వరకు వదలమన్న మైనంపల్లి.. రేవంత్ ప్రభుత్వం రుణమాఫీ చేసిన వేళ.. తన ఎమ్మెల్యే పదవికి హరీశ్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

‘‘హరీశ్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్లే రైతుల రుణమాఫీ చేశారు. అందుకే.. ఆయన రాజీనామా చేసి పోటీ చేయాలి. హరీశ్ పై నేను పోటీ చేస్తాను. ఒకవేళ ఆ ఎన్నికల్లో హరీశ్ గెలిస్తే నేను రాజకీయాల నుంచి వెళ్లిపోతా’’ అంటూ సంచలన సవాలు విసిరారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీకి అనుమతి తీసుకున్నారని.. బీఆర్ఎస్ ర్యాలీకి అనుమతి తీసుకోలేదని పోలీసులు చెబుతుననారు. మొత్తంగా పోటాపోటీగా చేపట్టిన ర్యాలీలు సిద్ధిపేటలో హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దీంతో.. పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి.

Tags:    

Similar News