అమెరికాలో నారా లోకేష్ కు అపూర్వ స్వాగతం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఆయన చేరుకున్నారు. ఈ సందర్భంగా... లోకేష్ కు అక్కడి తెలుగు ప్రజలు, ప్రముఖులు, టీడీపీ అభిమానులు, ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
అవును... భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా పర్యటన చేపట్టారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్నారు. ఈ సమయంలో లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పుష్పగుచ్చాలు, శాలువాలతో వెల్ కమ్ చెప్పారు.
ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకూ మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో... ఈ నెల 29న లాస్ వేగాస్ సిటీలో జరగనున్న "ఐటీ సర్వీస్ సీనర్జీ" 9వ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు.
అనంతరం ఈ నెల 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలోనూ లోకేష్ పాల్గొంటారు. ఈ సమాంలో... 2000 సవత్సరంలోనే విజన్ 2020 పేరుతో ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ 2047 వికసిత్ ఏపీ సాధనకు లోకేష్ శ్రమిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక అగ్రరాజ్యంలో లోకేష్ కు ఘన స్వాగతం పలికినవారిలో... ఎన్నారై టీడీపీ యూఎస్ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇన్ ఛార్జ్ రవి మందలపు తో పాటు స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, ఐటీ సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్ప్పు, సతీష్ మండువ, సురేష్ మానుకొండ ఉన్నారు.