లోకేష్ ని బీజేపీ పెద్దలు దీవించినట్లేనా ?
ఇక కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో ఓడినా చంద్రబాబు రాజకీయం మాత్రం గెలుస్తూ వచ్చింది. అందుకే సొంత మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి అక్కడ తన స్థానం సుస్థిరం చేసుకున్నారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయ జీవితంలో పెద్దగా కష్టాలు అయితే లేవు. ఆయన 1978లో యువకుడిగా ఉన్నపుడే కాంగ్రెస్ ఐ అన్న కొత్త పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత అంతటి కాంగ్రెస్ మహా సాగరంలో మంత్రి కూడా అయ్యారు.
ఇక కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో ఓడినా చంద్రబాబు రాజకీయం మాత్రం గెలుస్తూ వచ్చింది. అందుకే సొంత మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి అక్కడ తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. 1995లో సీఎం అయిపోయారు. నాటి నుంచి టీడీపీ బాబు పగ్గాలలోనే ఉంది.
ఆయన తనయుడు నారా లోకేష్ 2009 ఎన్నికలలో పరోక్ష పాత్రతో రాజకీయాల్లోకి తన పరిచయాన్ని చేసుకున్నారు ఆయన 2014లో పార్టీ విజయం వెనక కూడా తెర వెనక పాత్ర పోషించారు అంటారు. అలా 2017 నాటికి మంత్రి అయిపోయారు 2024 లో మరోసారి మంత్రిగా పార్టీలో అత్యంత కీలకంగా మారారు.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇపుడు లోకేష్ చాలా ప్రాధాన్యతతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఆయన తాజాగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. చాలా మంది కేంద్ర మంత్రులను కలిసారు అందులో రాజ్ నాధ్ సింగ్ వంటి వారు లోకేష్ తో బాగా కలివిడిగా మాట్లాడారు. అశ్విని వైష్ణవ్ కూడా అదే తీరున అభిమానం చూపించారు. ధర్మేంద్ర ప్రధాన్ అయితే లోకేష్ తో బాగా ముచ్చటించారు.
ఇలా కేంద్రంలో కీలక మంత్రులు అంతా లోకేష్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతకు ముందే లోకేష్ బీజేపీలోని నంబర్ టూగా ఉన్న అమిత్ షాని కలిశారు. విశాఖ వచ్చిన ప్రధాని మోడీ ముందే తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు ఇవన్నీ చూసిన వారికి కేంద్రంలో బీజేపీ పెద్దల ఆశీస్సులు బాబు వారసుడికి దక్కినట్లేనా అని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఏ రకమైన రిసీవింగ్ లభిస్తుందో అదే లోకేష్ కి దక్కుతోంది.
లోకేష్ వెంట టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులతో పాటు పార్టీ ఎంపీలతో ఒక భారీ బృందమే కనిపిస్తోంది. ఇలా లోకేష్ కమలం పార్టీ పెద్దలను కలుస్తూ ఏపీకి ఏమి కావాలో వివరిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏపీలో తన పాత్ర ఏమిటి అన్నది చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. అంతే కాదు జాతీయ మీడియాతోనూ ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు.
ఏపీ నుంచి చంద్రబాబు వస్తే కనబరచే ఆసక్తి ఇపుడు లోకేష్ విషయంలోనూ జాతీయ మీడియా కనబరుస్తోంది. ఇవన్నీ చూసిన వారు అంతా అనేది ఒక్కటే అంటున్నారు. ఏపీకి ఫ్యూచర్ లీడర్ లోకేష్ అన్నది జాతీయ రాజకీయాలలో ఉన్న వారికి కూడా అర్ధం అయిందా అన్నది. లోకేష్ కూడా స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా తన ఇమేజ్ ని పెంచుకోవడంతో పాటుగా పార్టీని ప్రభుత్వాన్ని ఎలివేట్ చేస్తున్నారు. అలాగే ఏపీకి కేంద్రం నుంచి రావాల్సినవి అడుగుతున్నారు.
ఒక విధంగా బాబుకు భారం తగ్గిస్తున్నారు. అదే సమయంలో తానే భవిష్యత్తు అని అటు పార్టీకి ప్రభుత్వానికి కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరహా వ్యూహంతో లోకేష్ ఇపుడు జాతీయ రాజకీయాల్లో హైలెట్ అవుతున్నారు. పెద్దాయన జేసీ దివాకర్ రెడ్డి లోకేష్ బాబు మరో మూడేళ్ళ తరువాత సీఎం అవుతారని అంటున్నారు కానీ చినబాబు జోరు చూస్తూంటే ఆయన అంతకంటే ముందే అయ్యేట్లుగా ఉన్నారని అంటున్నారు.
ఇక బీజేపీ పెద్దలకు ఏపీ రాజకీయం కావాలి. అందువల్ల వారు లోకేష్ కి తమ నిండు ఆశీస్సులు అందించక తప్పదని అది అనివార్యమని కూడా అంటున్నారు. బహుశా తనతోనే టీడీపీ అన్న సందేశాన్ని కూడా ఈ పర్యటనలో లోకేష్ జాతీయ పెద్దలకు ఇచ్చి ఉంటారని అంటున్నారు. సో లోకేష్ బాబు ఢిల్లీ టూర్ అయితే ఆయన ఇమేజ్ ని కొత్తగా బిల్డప్ చేయడంలో సూపర్ హిట్ అయినట్లే అని అంటున్నారు.