ఒక రోజు-మూడు ఘటనలు- కూటమికి దిద్దుబాటు అవస్యం!
చూస్తూ కూర్చుంటే తాడు కూడా పామవుతుందన్నట్టు.. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల ను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోకపోతే.. సర్కారుకు చెడ్డ పేరు ఖాయమని అంటున్నారు పరిశీలకులు.
చూస్తూ కూర్చుంటే తాడు కూడా పామవుతుందన్నట్టు.. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల ను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోకపోతే.. సర్కారుకు చెడ్డ పేరు ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు ఏం జరిగినా.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే బాధ్యతను సీనియర్లకుఅప్పగిస్తూ వచ్చారు. అయితే..వారి మాటలు కూడా బుట్టదాఖలవుతున్నాయి. దీంతో కూటమి నేతల దూకుడుతో మొదటికే మోసం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.
తాజాగా బుధవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన పార్టీల్లో మూడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయా పార్టీల నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదం.. చర్చనీయాంశం కూడా అయింది. 1) జనసేన పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే.. ఒకరు సచివాలయ సెక్రటరీపైనే నిప్పులు చెరిగారు. నీ అంతు చూస్తా.. నా మాటే వినవా? అంటూ.. మీడియా ముందే.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సదసు సెక్రటరీ సెలవుపై వెళ్లిపోయారు.
2) టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్రను గతంలో పోలీసు స్టేషన్కు పదే పదే పిలిచి.. అక్రమ కేసులు బనాయించారని ఆ పార్టీ నేతలు చెప్పే మాజీ ఎస్పీ రవీంద్రనాథ్బాబును.. అదే కొల్లు రవీంద్ర పాల్గొనే కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. దీంతో అవాక్కయిన మంత్రి.. విజయవాడ పరిసరాలకు వచ్చాక.. విషయం తెలుసుకుని వెనుదిరిగారు. దీనిపై ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తమను వేధించిన అధికారులకు ఇంతలా సత్కారం చేస్తోంది.. సొంత పార్టీ నేతలేనని తెలుసుకుని మంత్రి ఆవేదన చెందారు.
3) గుమ్మనూరు జయరాం వ్యవహారం. తన కుటుంబంపై తప్పుడు వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబె డతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. దీనిపై పార్టీ అధిష్టానం.. స్పం దించి వివరణ కోరి సరిపుచ్చింది. కానీ.. ఇలా చూస్తూ ఊరుకుంటే.. ఉదాసీనంగా వ్యవహరిస్తే.. నాయకు లు మరింత రెచ్చిపోవడం ఖాయమని సొంత పార్టీల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేనలు నేతలపై కొరడా ఝళిపించాల్సిందేనని సీనియర్లు చెబుతున్నారు.