లోకేష్ లోని కొత్త యాంగిల్ అది
బాబుని చూసిన కళ్లల్తో లోకేష్ ని చూసి పాలిటిక్స్ ని ఆయన పనికిరారు అన్న వారు పప్పు అని పేరు పెట్టారు.
నారా లోకేష్ ని ఇపుడు పప్పు అని ఎవరైనా అనాలీ అంటే వారే పప్పు అనుకోవాలి. అత్యంత ప్రతీకూల పరిస్థితుల నుంచి లోకేష్ ఒక రాజకీయ నేతగా రూపాంతరం చెందారు. తనను తాను ఆయన తీర్చిదిద్దుకున్నారు. చంద్రబాబు వంటి అపర చాణక్యుడు వారసుడు అన్న బరువైన ట్యాగ్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కి ఎంట్రీ సులువే కావచ్చు కానీ బాబు వారసత్వమే ఆయనకు మోయనేని బరువుగా మారింది.
బాబుని చూసిన కళ్లల్తో లోకేష్ ని చూసి పాలిటిక్స్ ని ఆయన పనికిరారు అన్న వారు పప్పు అని పేరు పెట్టారు. కానీ లోకేష్ ని ఈ రోజున చూస్తే కనుక ఆయనలో వచ్చిన పరిపక్వత కానీ ఆయన ఆలోచనా విధానం కానీ ఆయన మీడియాను ఫేస్ చేస్తున్న తీరు కానీ పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడుతున్న విధానం కానీ పార్టీ కేడర్ కి ఇస్తున్న భరోసా కానీ ఇవన్నీ లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అని చెప్పడంలో తప్పులేదు అని అంటున్నారు.
లోకేష్ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని వెలితీసే సందర్భం అరుదుగా వస్తుంది. అలా ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ ని టైమ్స్ నౌ సంస్థ చేసిన ఇంటర్వ్యూలో ఎన్నో చిక్కు ప్రశ్నలతో ఆయనను టార్గెట్ చేసింది. అయితే లోకేష్ ఎక్కడా తొణకకుండా బెణకకుండా పూర్తి చతురతతో సమయస్ఫూర్తిగా బదులిస్తూ తనలోని రాజకీయ పరిణతిని నిరూపించుకున్నారు.
రాహుల్ గాంధీ మీద లోకేష్ అభిప్రాయాన్ని అడిగినపుడు ఆయన పాదయాత్ర రాహుల్ గాంధీని మార్చిందని తాను నమ్ముతున్నట్లుగా చెప్పారు. అదే సమయంలో రాహులో తాను అంగీకరించని విషయాలు కూడా కొన్ని ఉన్నాయని అన్నారు. రాహుల్ ది కాంగ్రెస్ ది మితిమీరిన సంక్షేమ అజెండా అని చెప్పారు.
ఈ దేశానికి సంక్షేమం అలాగే అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందని అన్నారు. దేశాన్ని నడిపించే సామర్ధ్యం రాహుల్ లో ఉందా అన్న ఒక టిపికల్ క్వశ్చన్ కి కూడా లోకేష్ బెటర్ అయిన ఆన్సర్ ఇచ్చారు. కాలమే జవాబు చెప్పాలి అని ఆయన తనలోకి చతురతను ఈ విధంగా చూపించారు అన్న మాట.
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ గురించి అడిగిన ప్రశ్నకు లోకేష్ జవాబు చెబుతూ యూపీకి ఆయన ఎంతో కొంత మేలు చేశారు అని పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విషయానికి వస్తే ఆమెను గౌరవిస్తాను అంటూ సున్నితమైన ఆన్సర్ ఇచ్చారు. అక్కడ జరుగుతున్న వైద్యుల సమ్మె తదితర పరిస్థితుల మీద ప్రశ్నలకు ఆమెకు ఇది సవాళ్లతో కూడిన సమయం అని చెప్పి చాలా ఒడుపుగానే తప్పించుకున్నారు అని అంటున్నారు
చంద్రబాబు అరెస్ట్ మీద ఆయనను ప్రశ్నిచినపుడు కూడా ఏ మాత్రం ప్రత్యర్ధుల మీద విమర్శలు చేసి బ్యాలెన్స్ కోల్పోకుండా ఆయన చక్కగానే బదులిచ్చారు చంద్రబాబు క్లీన్ రికార్డు ఉన్న నాయకుడు అని అన్నారు. ఆయనను అరెస్ట్ చేసినపుడు హైదరాబాద్ లో ఏకంగా 45 వేల మంది ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపేందుకు ముందుకు రావడం ఆనందం కలిగించింది అని అన్నారు.
అదే విధంగా వ్యవస్థల వైపు నుంచి ఆ అరెస్ట్ వేళ కొంత నిరాశకు తాను గురి అయ్యాను అన్నారు. అంతే కాదు తన లైఫ్ లో మొదటి సారి జైలుకు వెళ్ళి ములాఖత్ ద్వారా కలసింది చంచ్రబాబునే అని అంటూ ఒక కుటుంబ సభ్యుడిగా తాను బాబుని అక్కడ చూసి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయాను అని లోకేష్ చెప్పుకొచ్చారు రాజమండ్రీ జైలుని బాబు సీఎం గా ఉండగా ఆధునీకరించారని ఆయనను అక్కడ పెట్టిన వేళ అంతా అదే గుర్తు చేసుకున్నారు అని అన్నారు.
ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయన్న దాని మీద కూడా లోకేష్ చక్కని బదులే ఇచ్చారు. ప్రజలు తమకు ఓటేసింది ఏపీని దేశంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దమని. అంతే తప్ప వేరొకటి కాదని అంటూ రెడ్ బుక్ గురించి వచ్చే విమర్శలకు ఒకే ఒక్క సమాధానంతో ఎండ్ కార్డు వేశారు. సమాజానికి మేలు చేయమని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తాము అలాగే వాడుతామని అభివృద్ధి సంక్షేమమే తమ అజెండా తప్ప రెడ్ బుక్ కాదని లోకేష్ తేల్చి చెప్పినట్లు అయింది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ ఇంటర్వ్యూ మొత్తం సారాంశం ప్రకారం లోకేష్ బాగానే రాటు దేలారు అని అనిపించక మానదు.