ఓటర్లను భయపెట్టి ఓట్లు సంపాదించిన మోడీ...బాబు !

న్యూ ట్రెండ్ ని అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు క్రియేట్ చేశారు అని అంటున్నారు. అదేంటి అంటే ఓటర్లను భయపెట్టి ఓట్లు పొందడం అని అంటున్నారు. ఈ

Update: 2024-05-21 07:52 GMT

ఓట్లు సంపాదించాలంటే శత కోటి మార్గాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం ఏమిటి అంటే విన్నపాలు చేసుకోవడం, తాము ఎలాంటి మంచి పాలన అందిస్తామో చెప్పడం, తమ నాయకత్వ లక్షణాల గురించి తాము చేసిన కార్యక్రమాల గురించి జనాలకు చెబుతూ వారి మెప్పు పొందుతూ ఉంటారు. ఇది సంప్రదాయ ఎన్నికల ప్రచారంలో అంతా అనుసరించే విధానం. కానీ ఈసారి జరుగుతోంది మాత్రం వేరే లెవెల్ అని అంటున్నారు.

న్యూ ట్రెండ్ ని అటు ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు క్రియేట్ చేశారు అని అంటున్నారు. అదేంటి అంటే ఓటర్లను భయపెట్టి ఓట్లు పొందడం అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు జూన్ 4న కనుక ఫలితాలు వచ్చి కేంద్రంలో మోడీ అలాగే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇక సంక్షేమ పధకాలు కానీ అభివృద్ధి కానీ అసలు అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అదేలా అంటే ఈ ఇద్దరి ప్రసంగాలు ప్రచార శైలిని బట్టే ఈ విధమైన మాట అంతా అంటున్నారు. మోడీ రెండు సార్లు కేంద్రంలో బీజేపీ తరఫున అధికారంలో ఉన్నారు. పదేళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. కానీ ఆయన తన ప్రచారంలో ఎక్కడా తాను ప్రధానిగా గత దశాబ్ద కాలంలో చేసిన అభివృద్ధిని గురించి చెప్పుకోవడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

అదే సమయంలో ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంతే సంగతులు అంటూ ఓటర్లను విపరీతంగా భయపెడుతున్నారు అని అంటున్నారు. నిజానికి చూస్తే పదేళ్ళ పాలనలో జీ 20 సమ్మిట్ ని దేశంలో నిర్వహించామని చెప్పుకోవచ్చు. అలాగే దేశ ఆర్ధి వృద్ధి రేటుని అయిదు ట్రిలియన్ డాలర్లకు చేర్చుతామని చెప్పడంలేదు, విశ్వ గురు అన్న మాట లేదు, మేక్ ఇన్ ఇండియా అన్న మాట అంతకంటే లేదు, ఉద్యోగాల కల్పన గురించి కానీ దేశంలో సమస్యల గురించి కానీ ఏమీ లేదు.

కేవలం కాంగ్రెస్ మీద విరుచుకుపడడం ముస్లిం మైనారిటీల పేరిట ఎమోషన్ క్రియేట్ చేయడమే ఒక తంతుగా సాగుతోంది అని అంటున్నారు. దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే చాలు ముస్లిం లకు దోచిపెడుతుంది అన్న మాటనే ఒక నినాదంగా మోడీ కానీ బీజేపీ కానీ చేసుకుంది అని అంటున్నారు.

కాంగ్రెస్ ని అధికారంలోకి తేవద్దు అంటూ ఓటర్లను బెదిరించడం జరుగుతోంది అని అంటున్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన మంగళసూత్రాలను తెగనమ్మి ముస్లింల కోసం దోచిపెడుతుందని కూడా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇవన్నీ ఒక విధంగా ఓటర్లను భయపెట్టడమే అని అంటున్నారు.

ఓట్లు దేశంలో ఉన్న వారే వేస్తారు కానీ మోడీ ప్రసంగాలలో ఎక్కడో ఉన్న పాకిస్థాన్ ఇష్యూని తెస్తున్నారు. అలాగే పీఓకే సమస్యను ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఇవన్నీ దేశాల మధ్య ఉన్న సమస్యలు వాటికీ ఓటర్లకు పెద్దగా సంబంధం లేవు. అయినా సరే భావోద్వేగాలను కలిగించడం కోసమే ఈ విధంగా బీజేపీ అధినాయకత్వం కానీ మోడీ కానీ పదే పదే ఈ విషయాలను ప్రస్తావిస్తున్నారు అని అంటున్నారు.

ఎవరైనా ప్రజల వద్దకు వెళ్ళినపుడు మేము ఫలానా పని చేశామని చెబుతారు, మాకు ఈ కారణంగా ఓట్లు వేయండి అని అంటారు. కానీ కాంగ్రెస్ వస్తే దేశం సర్వ నాశనం అవుతుంది, లేదా ఫలానా వర్గం వల్ల ఇబ్బంది అవుతుంది అని బెదిరింపు ధోరణితో ప్రచారం చేయడం బీజేపీ నేతలకే చెల్లింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఏపీలోనూ ఇదే తరహా ప్రచారం సాగింది. దానిని ప్రారంభించిన వారు చంద్రబాబు. ఆయన కూడా తాను 2014 నుంచి 2019 దాకా ఏపీ సీఎం గా ఏమి చేశాను అన్నది ఎక్కడా చెప్పలేదు, ఎంత సేపూ వైసీపీ వస్తే ఏపీ నాశనం అవుతుందని చెబుతూ వచ్చారు. అంతే కాదు ఎపుడో అయిదేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వివేకా హత్య కేసుని పదే పదే ఎన్నికల సభలలో ప్రస్తావిస్తూ ఓటర్లను భయపెట్టేశారు.

మళ్ళీ జగన్ ఏపీలో అధికారంలోకి వస్తే మీ భూములు దోచుకుంటారు అని కూడా బెదిరింపులు చేస్తూ పోయారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయం కేంద్రానిది. మోడీ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఒక మోడల్ ప్రాజెక్ట్ ని ఏపీలో చేయించారు తప్పితే ఏమీ జరగలేదు. అయితే దాని మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఓటర్లను బెదిరించే కార్యక్రమానికి చంద్రబాబు దిగిపోయారు అని అంటున్నారు.

జగన్ మళ్ళీ వస్తే మీ భూములు మీకు దక్కవని కూడా విపరీతమైన భయం పెంచుతూ ప్రచారం చేశారు. ఇలా ఓటర్లను బెదిరించి ఓట్లు వేయించుకున్నారు అన్నది ఒక టాక్ గా ఉంది. మరి ఇదే తీరున ప్రచారం చేస్తూ పోతే దేశమో అభివృద్ధి మీద చర్చ అక్కరలేదు, సంక్షేమం గురించి అసలు మాట్లాడాల్సిన పని లేదు అని అంటున్నారు. అయిదేళ్ళ పాలనకు సైతం అర్ధం ఉండదని అంటున్నారు.

ఎన్నికల వేళకు ఏదో ఒక ఇష్యూని ముందుకు తేవడం అలా జనాలను భయపెట్టి ఓట్లు వేయించుకోవడమే చేస్తారు అని అంటున్నారు. ఈ విధంగా ఓటర్లను భయపెడితే అవరు ఓట్లు ఎంత మేరకు వేస్తారు అన్నది జూన్ 4న ఫలితాలు తేల్చనున్నాయి. అక్కడ కనుక సక్సెస్ అయితే రాబోయే రోజులలో ఇలా బెదిరింపు పాలిటిక్స్ కే కాలం వచ్చినట్లుగా అంతా భావించల్సి ఉంటుందని అంటున్నారు మేధావులు.

Tags:    

Similar News