ప్రధాని మోడీకి కొత్త ప్రైవేట్ సెక్రటరీ... ఎవరీ నిధి తివారీ?

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్స్ సర్వీస్ అధికారిణి నిధి తివారీ నియామకమయ్యారు.;

Update: 2025-03-31 09:31 GMT
ప్రధాని మోడీకి కొత్త ప్రైవేట్ సెక్రటరీ... ఎవరీ నిధి తివారీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐ.ఎఫ్.ఎస్) అధికారిణి నిధి తివారీ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్ మెంట్స్ కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. దీంతో.. ఈమె ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. గతంలో ఏమి చేశారు అనే విషయాలు చర్చకు వచ్చాయి.

అవును... భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్స్ సర్వీస్ అధికారిణి నిధి తివారీ నియామకమయ్యారు. ఈ సందర్భంగా.. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో... ఈమె ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

వారణాసిలోని మెహముర్ గంజ్ కు చెందిన నిధి తివారీ... సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. 2014 బ్యాచ్ కు చెందిన ఆమె గతంలో వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేశారు. ఈ క్రమంలో 2022లో ఆమె తొలుత అండర్ సెక్రటరీగా చేరారు. ఇదే సమయంలో.. 2023 జనవరి నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

అంతకంటే ముందు విదేశాంగ మంత్రిత్వశాఖలో పని చేశారు. అదేవిధంగా.. అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కు ఫారెన్ అండ్ సెక్యూరిటీకి చెందిన అంశాలను నేరుగా ఆయనకు నివేదించడంలో కీలక పాత్ర వహించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీకి ప్రైవేట్ సెక్రటరీగా ఆమె నియామకమయ్యారు.

Tags:    

Similar News