నాకు నువ్వు.. నీకు నేను.. ఆ ఇద్దరు మోనార్క్ నేతల బంధం బలోపేతం

రష్యాతో సరిహద్దు ఉన్న దేశాల్లో బహుశా ప్రపంచంలో రష్యాను బాగా నమ్మే దేశం ఉత్తర కొరియానే ఏమో? పైగా రెండూ అమెరికాకు బద్ధ వ్యతిరేకులు.

Update: 2024-11-12 07:30 GMT

వామపక్ష భావజాలం అయితేనేమి.. ఇరుగు పొరుగు కావడం అయితేనేమి.. వాటి అధినేత వైఖరి అయితేనేమి..? అమెరికాతో ఉన్న ఆగర్భ శత్రుత్వం అయితేనేమి..? ప్రపంచంలో ఆ రెండు దేశాల సంబంధాలు విడదీయరానివవి. ఏ అవసరం వచ్చినా సాయం చేసుకునేంత సాన్నిహిత్యం వాటి మధ్య ఉంది. శత్రువును ఉమ్మడిగా ఎదుర్కొనే ఆలోచన వారిది. అలాంటి రెండు దేశాలను కాలం మరింత కలుపుతోంది. సైనిక సాయం నుంచి రక్షణ రంగంలో ఒప్పందాలకు విస్తరించింది.

ఉ.. అంటే ఉత్తరం

రష్యాతో సరిహద్దు ఉన్న దేశాల్లో బహుశా ప్రపంచంలో రష్యాను బాగా నమ్మే దేశం ఉత్తర కొరియానే ఏమో? పైగా రెండూ అమెరికాకు బద్ధ వ్యతిరేకులు. చైనా కంటే కొన్ని విషయాల్లో రష్యా మీదనే ఆధారపడుతుంది ఉత్తర కొరియా. ఇప్పుడు ఈ రెండు దేశాలు రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా, యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ కు సైనికులను పంపాలన్న ఉత్తర కొరియా నిర్ణయం ఇప్పటికే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి సమయంలో రష్యా, ఉత్తర కొరియాల స్నేహంపై పాశ్చాత్య దేశాలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నాటో బాటలో

‘తమ కూటమిలోని ఒక దేశంపై దాడి జరిగితే అది యావత్ కూటమిపై దాడి’.. ఇదీ నాటో సిద్ధాంతం.. దీనినే ఇప్పుడు తమకు నచ్చిన రీతిలో అన్వయించుకుంటున్నాయి రష్యా-ఉత్తర కొరియా. శత్రు దేశం నుంచి దాడి జరిగితే ఒకదానికొకటి సహకరించుకునేలా రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా, పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైక కొద్ది రోజులకే.. అంటే జూన్‌ లోనే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఉత్తర కొరియా తాజాగా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది పుతిన్, కిమ్ లు పరస్పరం పొరుగు దేశాల్లో పర్యటించారు. బహుశా సమయంలోనే రక్షణ ఒప్పందానికి బీజం పడి ఉంటుంది.

కొరియాల ఘర్షణ వేళ

కొద్ది రోజులుగ ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా అధినేత కిమ్ కవ్వింపు చర్యలతో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి సమయంలో కొరియా ద్వీపకల్పంలో అమెరికా మిత్రపక్షాల మధ్య పెరుగుతున్నది. దీంతో కిమ్‌, పుతిన్ మరింత సన్నిహితం అవుతున్నారు.

Tags:    

Similar News