ప్రముఖ వ్యాపారవేత్తపై లైంగిక ఆరోపణలు.. చేసింది ఆయన సోదరే..
తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఈ దారుణాలను అనుభవించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ వ్యాపారవేత్త.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ పై ఆయన సోదరి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో ఆయన పెను వివాదంలో చిక్కుకున్నారు. గడిచిన దశాబ్ద కాలం నుంచి శామ్ ఆల్టమన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు మిస్సోరీ డిస్టిక్ట్ కోర్టులో ఆమె దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఈ దారుణాలను అనుభవించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. మిస్సోరీలోని క్లాటన్లో గల తమ ఇంటిలోనే తాను వేధింపులను ఎదుర్కొన్నట్లు ఆమె వెల్లడించారు. అప్పుడు తనకు మూడేళ్లు ఉంటాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. శామ్‌కు 12 ఏళ్లు ఉన్నాయని, 1997 నుంచి 2006 వరకు అతడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఫిర్యాదు చేశారు. వారానికి అనేక సందర్భాలలో ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చినట్లు వెల్లడించారు. ఈ దారుణమైన అనుభవాలతోనే తాను తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు పేర్కొన్నారు.
మానసికంగానూ తీవ్రమైన కుంగుబాటుకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమోనన్న ఆందోళనను ఆమె తాజాగా వ్యక్తం చేశారు. ఇదంతా ఆమె తన దావాలో పేర్కొన్నారు. ఈ తరహా ఆరోపణలతో కూడిన పోస్టును గతంలో ఆమె ఎక్స్ వేదికగా పెట్టారు. అయితే.. ఈసారి ఆమె నేరుగా కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తన సోదరి చేసిన ఆరోపణలపై శామ్ కూడా స్పందించారు. సోదరి ఆరోపణలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శామ్ ఆల్టమన్, ఆయన తల్లి, సోదరులు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఆమె మానసిక పరిస్థితి సరిగాలేదని ఈ సందర్భంగా ఆరోపించారు. ఆమె ఆరోగ్యం పట్ల తాము చాలా ఆందోళనకు గురవుతున్నామని వెల్లడించారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పనిగా వ్యాఖ్యానించారు. ఆయనకు అండగా ఉండేందుకు తాము చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామని, ఆర్థికంగానూ సాయం చేస్తున్నామని వివరించారు. ఎన్ని చేస్తున్నప్పటికీ ఆమె తమను ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉందని పేర్కొన్నారు.
తమ కుటుంబంపై, ముఖ్యంగా శామ్ పై అవాస్తవ ఆరోపణలు చేసి తమను మరింత ఎక్కువ బాధపెట్టిందని ఈ సందర్భంగా ఈ లేఖలో పేర్కొన్నారు. ఆమె గోపిక దృష్ట్యా తాము దీనిపై బహిరంగంగా స్పందించకూడదని అనుకుంటున్నట్లు వెల్లడించారు. కానీ.. ఇప్పుడు ఆమె శామ్ పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శామ్ కుటుంబ సభ్యులు మరిన్ని విషయాలపైనా స్పందించారు. తండ్రి నిధులను అక్రమంగా అట్టి పెట్టుకొని సొంత కుటుంబ సభ్యులపైనే ఆరోపణలకు దిగిందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తను లైంగికంగా వేధించాడంటూ చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అవాస్తమని తేల్చి చెప్పేశారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబ గోపి అతను గౌరవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆ ప్రకటనలో వివరించారు. ఇదిలా ఉంటే శామ్ పై ఆరోపణ చేసిన ఆయన సోదరి గడిచిన కొన్నాళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ సంచలన ఆరోపణలు చేయడంతోపాటు కోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉంటే ఏఐ చాట్ జిపిటి సృష్టికర్తగా, ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓగా శామ్ ఆల్టమన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నారు. గతేడాది ఆయనను ఈ సంస్థ తొలగించింది. ఇది అప్పట్లోనే పెద్ద వివాదానికి దారితీసింది. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కంపెనీ బోర్డు ఆయనను తిరిగి తీసుకుంది.