ల్యాండ్ అయ్యాక చూస్తే ఫ్లైట్ కి చక్రం లేదు... పాక్ లో ఏం జరిగింది?
సాధారణ చెక్కింగ్ వేళ.. ఆ విమానానికి ఒక చక్రం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఆ కథాకమీషేమిటనేది ఇప్పుడు చూద్దామ్...!;
ఇటీవల కాలంలో జరుగుతోన్న పలు విమాన ప్రమాదాలు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. పైగా... విమానాల్లో లోపాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ల్యాండింగ్ సమయంలో సమస్యలు మొదలైనవి నిత్యం ఏదో ఒక మూల దర్శనమిస్తుండటం మరింత టెన్షన్ పెడుతుందని అంటున్నారు. ఈ సమయంలో పాకిస్థాన్ లో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.
అవును... విమానం బాగానే టేకాఫ్ అయ్యింది.. బయలు దేరింది.. ప్రయాణం ముగించుకుని మరో విమానాశ్రయంలో కూడా బాగానే ల్యాండ్ అయ్యింది. అంతాబాగానే ఉంది కదా అనుకునే సమయంలో... సాధారణ చెక్కింగ్ వేళ.. ఆ విమానానికి ఒక చక్రం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఆ కథాకమీషేమిటనేది ఇప్పుడు చూద్దామ్...!
పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన ఓ దేశీయ విమానానికి ఊహించని ఘటన ఎదురైంది. లాహోర్ లో ల్యాండింగ్ సమయంలో ఆ విమానానికి ఒక చక్రం లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో... ఒక్కసారిగా షాక్ అయ్యారు! అయితే... ల్యాండింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం పీకే-306.. కరాచీ నుంచి లాహోర్ కు బయలుదేరింది. ఈ సమయంలో... లాహోర్ విమానాశ్రయంలో దిగిన అనంతరం కెప్టెన్ రెగ్యులర్ చెక్కింగ్ చేశారు. ఆ సమయంలో.. విమానం వెనుక చక్రాల్లో ఒకటి లేదని గుర్తించారు. దీంతో... ఒక్కసారిగా షాక్ కి గురైనప్పటికీ... విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని పీఐఏ అధికారులకు వెల్లడించారు.
ఈ సందర్భంగా స్పందించిన పీఐఏ ఎయిర్ లైన్స్ సంస్థ... ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని వెల్లడించింది. ఇదే సమయంలో... ఆ విమానం చక్రం కరాచీలో బయలుదేరేటప్పుడే మిస్సయ్యిందా.. లేక, టేకాఫ్ సమయంలో ఊడిపోయిందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.