బిగ్ బాస్ విజేతకు ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశంస.. ఎందుకంటే?

రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో రూటే సపరేటు.. అందులో తెలుగు బిగ్ బాస్ అంటే మరింత క్రేజ్ తెలుగు ప్రేక్షకులు ఆ విధంగా ఈ షోకు ఫిదా అయ్యారు

Update: 2023-12-18 11:52 GMT

రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో రూటే సపరేటు.. అందులో తెలుగు బిగ్ బాస్ అంటే మరింత క్రేజ్ తెలుగు ప్రేక్షకులు ఆ విధంగా ఈ షోకు ఫిదా అయ్యారు. ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన షో.. ఏడో సీజన్ ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కొంది. హోస్ట్ మారబోతున్నారని, రాను రాను వ్యూవర్ షిప్ తగ్గుతుందని మొదట్లో కామెంట్లు వచ్చినా.. 'బిగ్ బాస్ సీజన్ 7-ఉల్టా పుల్టా'తో ఒక్కసారి హైప్ క్రియేట్ చేసింది.

15 వారాల పాటు కొనసాగిన ఈ షో ఆదివారం (డిసెంబర్ 17) రాత్రి ముగిసింది. సీజన్ 7లో 14 మంది హౌజ్ లోకి వెళ్లగా.. చివరి వరకు ఆరుగురు మాత్రమే ఉన్నారు. అందులో పల్లవి ప్రశాంత్ టైటిట్ దక్కించుకున్నాడు. రైతు బిడ్డగా యూట్యూబ్ లో పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తో అతి పెద్ద సెలబ్రెటీగా మారాడు. ప్రశాంత్ గెలుపుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు పల్లవి ప్రశాంత్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా గెలుపొందడంతో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎక్స్ (ట్విటర్) వేదికగా అభినందనలు కురిపించాడు. ఆయన ఏమన్నారంటే 'సిద్దిపేటకు చెందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ జిల్లాకు గుర్తింపు తెచ్చాడని రాసుకచ్చారు. తయన బిగ్ బాస్ లో వ్యవహరించిన తీరు రాష్ట్ర మంతటిని కట్టిపడేసింది. ఇప్పుడు ఆయన అందరి ఇళ్లలో కుటుంబ సభ్యుడిగా మారాడు. సామాన్యుడు సైతం దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తే.. ఎలా కీర్తిని గడిస్తాడో ఆయన జీవితమే నిదర్శనం అన్నారు. ఇంకా ఆయన గెలుచుకున్న ప్రైజ్ మనీని కూడా రైతులకు కోసం ఖర్చు పెడతానని చెప్పడం మరింత ఆనందాన్ని ఇచ్చింది'. అని హరీశ్ రావు చెప్పారు.

బిగ్ బాస్ లో గెలిచిన పల్లవి ప్రశాంత్ ను ఆయన తల్లిదండ్రులు, రైతులు, స్నేహితులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రైజ్ మనీని రైతులకు ఖర్చు పెట్టి రైతు బిడ్డగా ఆయన దేశం యావత్తు గర్వించే పని చేశాడని అన్నారు. ఆయనను రైతు బిడ్డలు ఆదర్శంగా తీసుకుంటే పంట పొలాల్లోనే కాదు.. బుల్లితెర, వెండితెరపై కూడా ప్రజల మనస్సులను కొల్లగొట్టవచ్చని సోషల్ మీడియాలో రాసుకుంటున్నారు.

Tags:    

Similar News