పవన్ దూకుడు.. `సీమ` సిత్రాలు మారుతాయా..!
ఇక, వైసీపీ హయాంలో అయితే.. ఇవి మరోసారి పెరిగాయనే చెప్పాలి. ఎవరికి వారు తమ హవా చలాయిం చుకునేందుకు చేసిన ప్రయత్నంలో సీమ జిల్లాల్లో మరోసారి.. కక్షపూరిత రాజకీయాలు.. హత్యలు కొనసా గుతున్నాయి.
ఒకప్పుడు.. ఐపీఎస్ వ్యాస్.. అనంతపురం ఎస్పీగా ఉన్న సమయంలో దూకుడు ప్రదర్శించారు. కక్ష పూ రిత రాజకీయాలు సాగే సీమలో మార్పులు తెచ్చేదిశగా ప్రయత్నాలు చేశారు. ఇక, ఆ తర్వాత పనిచేసిన వారు కొందరు.. ఇదే ప్రయత్నాలు చేశారు. మరీ ముఖ్యంగా కడప ఎస్పీగా పనిచేసిన సమయంలో హెచ్‌జే దొర(తర్వాత కాలంలో డీజీపీ అయ్యారు) కూడా ఇలానే ఉక్కుపాదం మోపారు. వారు ప్రయత్నించినా.. కొంత వరకు మాత్రమే మార్పు తీసుకువచ్చారు. తర్వాత.. యథాప్రకారం మామూలే అయింది.
అంతేకాదు..ఐపీఎస్‌లు కూడా టార్గెట్ అయ్యారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్టుగా వ్యాస్ దారుణ హత్యలో అప్పటి సీమ నేత ల హస్తం కూడా ఉంది. కట్ చేస్తే.. ఆ తర్వాత.. చంద్రబాబు సీఎంగా కొంత మార్పు కోసం ప్రయత్నం చేశారు. అభివృద్ధి బాటపట్టించారు. పాఠశాలలు ఏర్పాటు చేశారు. విద్యకు దూరంగా ఉన్న సీమ గ్రామాలను చైతన్యం చేశారు. దీంతో మరికొంత తగ్గింది. కానీ, వేళ్లూనుకున్న కక్ష పూరిత రాజకీయాలు మాత్రం ఎక్కడా సమసి పోలేదు.
ఇక, వైసీపీ హయాంలో అయితే.. ఇవి మరోసారి పెరిగాయనే చెప్పాలి. ఎవరికి వారు తమ హవా చలాయించు కునేందుకు చేసిన ప్రయత్నంలో సీమ జిల్లాల్లో మరోసారి.. కక్షపూరిత రాజకీయాలు.. హత్యలు కొనసా గుతున్నాయి. ఇక.. ఇప్పుడు వీటిని అంతం చేస్తానంటూ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెబుతున్నారు., ఎంపీడీవో జవహర్‌బాబు పై దాడి జరిగిన తర్వాత.. అక్కడ పర్యటించిన పవన్.. సీమ రూపు రేఖలు మారుస్తానని.. కక్ష పూరిత రాజకీయాలు లేకుండా చేస్తానని చెబుతున్నారు.
కానీ, ఇది అంత సాధ్యమయ్యే పనికాదు. తరతరాలుగా వేళ్లూనుకున్న కక్ష పూరిత రాజకీయాలు.. నేతల మధ్యే ఎక్కువగా ఉన్నాయి. ఆ ఇంటిపై కాకి.. ఈ ఇంటిపై వాలకూడదన్న రేంజ్లో ఇక్కడ నాయకులు రె చ్చిపోతూ ఉంటారు. పైగా ఇసుక, మద్యం సహా పరిశ్రమల విషయంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో సీమ సరిచేస్తానంటూ.. పవన్ ముందుకు వచ్చినా.. ఆయన కూటమి పార్టీల నుంచేపరీక్షలు ఎదురయ్యే అవకాశం అయితే.. మెండుగా ఉంది. మార్పు మంచిదే అయినా.. ఇప్పటికిప్పుడు మార్పు రాదనేది సీమ రాజకీయాలు బాగా తెలిసిన వారు చెబుతున్న మాట. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.