కనిపించని పవన్...కూటమిలో ఏమి జరుగుతోంది ?

టీడీపీ కూటమి ప్రభుత్వానికి జీవ కర్ర మూలాధారం పవన్ కళ్యాణ్ అన్నది తెలిసిందే. ఆయన చొరవ తీసుకోవడం వల్లనే బీజేపీ టీడీపీ రెండూ కలిశాయన్నది తెలిసిందే.

Update: 2025-02-12 03:25 GMT

టీడీపీ కూటమి ప్రభుత్వానికి జీవ కర్ర మూలాధారం పవన్ కళ్యాణ్ అన్నది తెలిసిందే. ఆయన చొరవ తీసుకోవడం వల్లనే బీజేపీ టీడీపీ రెండూ కలిశాయన్నది తెలిసిందే. ఇక బంపర్ మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు.

ఎనిమిది నెలలుగా సాఫీగా సాగిన కూటమి కాపురంలో ఏమి జరుగుతోంది అన్న చర్చ ఇపుడిపుడే ముందుకు వస్తోంది. పవన్ కళ్యాణ్ వరసబెట్టి రెండవ కీలక సమావేశానికి గైర్ హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో గైర్ హాజరు కావడం అందరినీ విస్మయపరచింది.

పవన్ ఎందుకు రాలేదు అన్నది అయితే అంతటా చర్చగానే ఉంది. దీని కంటే ముందు ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా పవన్ హాజరు కాలేదు. ఆ సమావేశానికి ఒక రోజు ముందు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ కి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పారని అందుకే ఆయన కేబినెట్ మీటింగ్ కి రావడం లేదు అని ప్రకటనలో చెప్పారు.

ఈసారి అయితే అలాంటిది ఏదీ లేదు. ఏ ప్రకటనా రాలేదు. కానీ పవన్ మాత్రం గైర్ హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక కీలక శాఖల మంత్రులు వచ్చారు. కానీ పవన్ మాత్రం రాలేదు. అయితే కేబినెట్ మీటింగులో పవన్ సీటు అలాగే ఖాళీగా ఉంచేశారు. కానీ ఈసారి మాత్రం ఆ రకమైనది ఏదీ కనిపించలేదు.

నిజానికి పవన్ హాజరైతే చంద్రబాబు పక్క సీటులో అసీనులు అవుతారు. కానీ ఈసారి అలా జరగలేదు. దాంతో పవన్ గైర్ హాజరు విషయం ముందే తెలుసా లేక ఆయన తాను రావడం లేదు అన్నది ముఖ్యమంత్రికి చెప్పి ఉంటారా అన్నది కూడా చర్చగా ఉంది.

ఏది ఏమైనా కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు కీలక సమావేశాలలో పవన్ కనిపించకపోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం చూస్తే మెరుగుపడింది అన్న దానికి సంకేతాలుగా ఆయన బుధవారం నుంచి దక్షిణ భార దేశ యాత్రలకు వెళ్తున్నారు. మరి అలాంటపుడు ఆయన ఎందుకు రాలేదు అన్నదే చర్చగా ఉంది.

ఏది ఏమైనా కూటమి ప్రభుత్వంలో పవన్ యాక్టివిటీస్ కూడా చూస్తే కనుక కొంత తగ్గాయని అంటున్నారు. ఆయన బహిరంగ వేదికల మీద చివరిగా కనిపించినది రిపబ్లిక్ డే సందర్భానే అని అంటున్నారు. అంటే పదిహేను రోజులు పై దాటింది అన్న మాట. మరి పవన్ దక్షిణ భారత దేశ యాత్రల తరువాత అయినా పవన్ ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటే కనుక ఈ రకమైన రూమర్లకు చెక్ పడుతుంది. లేకపోతే ఏదో జరుగుతుందన్న చర్చ అయితే వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News