పవన్ కళ్యాణ్ ఎదిగారా ?
ఇక టీడీపీ నాయకత్వంలో ఏపీలో కూటమి ఏర్పాటు కావడానికి అతి ముఖ్య పాత్ర పోషించిన పవన్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తరువాత ఉప ముఖ్యమంత్రి హోదాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు.
పవన్ అన్న మూడు అక్షరాల చుట్టూ ఇపుడు రాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయి. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలకమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతే కాదు కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో సన్నిహిత మిత్రుడిగా ఉన్నారు. అలా జాతీయ స్థాయిలో ఏపీ స్థాయిలో ఒకే సమయంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రాధాన్యతను కొనసాగించడం అంటే గ్రేట్ అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ గత పదేళ్ళ జనసేన రాజకీయ పార్టీ స్థాపన తరువాత సాగించిన ప్రయాణంలో నెమ్మదిగా ఎదిగారు అని చెప్పాలి. ఆయన ఎక్కడ ఏమి చేయాలో ఏ విధంగా తన రాజకీయ వ్యూహాలను అమలు చేయాలో తెలుసుకుని ముందుకు సాగినట్లుగా ఆయన రాజకీయ జీవితం చూస్తే అర్ధం అవుతుంది.
ఇక టీడీపీ నాయకత్వంలో ఏపీలో కూటమి ఏర్పాటు కావడానికి అతి ముఖ్య పాత్ర పోషించిన పవన్ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు తరువాత ఉప ముఖ్యమంత్రి హోదాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన రాజకీయాలకు కొత్త కాకున్నా పాలకు కొత్త. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి వచ్చారు. ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి వంటి పవర్ ఫుల్ స్థానానికి చేరుకున్నారు. అంతే కాదు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, పర్యవరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీశాఖ వంటి కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు.
దాంతో పవన్ మంత్రిగా ఎలా రాణిస్తారు అన్న చర్చ ఆదిలో అయితే అందరికీ వచ్చింది. కానీ పవన్ దానిని ఒక సవాల్ గా తీసుకుని మొదట్లో ఆఫీసులోనే సమీక్షల పేరుతో గంటల తరబడి నిర్వహించిన సమావేశాల ద్వారా తన శాఖలకు సంబంధించిన పట్టుని సాధించారు. అంతే కాదు తన శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా వస్తాయన్నది కూడా ఆయన అవగాహన పెంచుకుని ఆ విధంగా కేంద్ర పెద్దల వద్ద తన పలుకుబడిని ఉపయోగించి నిధులను సాధిస్తున్నారు.
ఈ రోజు గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీలకు నేరుగా నిధులు విడుదల అవుతున్నాయన్నా అలాగే గ్రామీణ రహదారుల నిర్మాణం జరుగుతుందనుకున్నా ఇక మన్యం ప్రాంతాలలో రోడ్లు పడుతున్నాయని అనుకున్నా అదంతా కూడా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువగా నిధులు తేవడం వల్లనే సాధ్యమైంది అని అంటున్నారు
ఇక పవన్ అధికారిక హోదాలో సమీక్షలు అభివృద్ధి పనులకు తొలి ఆరు నెలల కాలాన్ని కేటాయించారు. ఆ తరువాత పవన్ ఇపుడు జనంలోకి రావాలని చూస్తున్నారు. జనంతో మమేకం కావాలని కూడా అనుకుంటున్నారు. నెలలో పద్నాలుగు రోజుల పాటు ప్రజలలో ఉండేలా ప్రణాళిలకను రూపిందించుకోవడం పవన్ రాజకీయ వ్యూహానికి దర్పణంగా భావిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడే ప్రజలకు మేలు చేయగలరు, అదే సమయంలో ప్రజలతో దూరం కూడా పనుల ఒత్తిడి వల్ల పెరుగుతుంది. దానికి అధిగమించేందుకు కూడా ప్రయత్నం చేసుకోవాలి. బహుశా పవన్ ఈ దిశగా ఆలోచిస్తూ జనంతో ఉండేలా నెలలో సగం రోజుల పాటు జిల్లా పర్యటనల కార్యక్రమాన్ని డిజైన్ చేశారేమో అని అంటున్నారు.
ఇక పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక మరో తేడా ఏంటి అంటే ఆయన అవసరం అయితేనే మాట్లాడుతున్నారు. మిగిలిన సమయంలో తన శాఖల గురించి సీరియస్ గా పర్యవేక్షణ చేస్తూ వాటితోనే బిజీ అవుతున్నారు. ఇది కూడా చాలా మంచి విషయమే అంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వారి మీదనే అందరి ఫోకస్ ఉంటుంది. వారు ఒక మాట చెప్పినా అది జనంలోకి సులువుగా వెళిపోతుంది. అది ప్లస్ అవుతుందా లేక మరోలా వెళ్తుందా అన్నది కూడా తెలియదు అని అంటున్నారు. దాంతో పవన్ మాటలు తగ్గించి చేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు.
అదే విధంగా పవన్ హిందూత్వ అజెండాను తీసుకోవడంలో కూడా పక్కా రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే హిందూత్వ ఎంతటి పవర్ ఫుల్ ఈ దేశంలో అన్నది తెలిసిందే. రెండు ఎంపీ సీట్ల బీజేపీని ఇప్పటికి అనేక సార్లు కేంద్రంలో గెలిపించినది ఇదే హిందూత్వ. ఏపీలో చూస్తే బీజేపీ ఎదగలేకపోతోంది. కాబట్టి హిందూత్వతో ప్రజాకర్షణ నేతగా పవన్ ముందుకు సాగితే బహుళ ప్రయోజనాలు ఉంటాయని ముందు చూపుతో చేసిన వ్యూహంగానే అంటున్నారు.
ఎవరు అవునన్నా కాదన్నా ఈ రోజుకీ బీజేపీ జాతీయంగా బలమైన పార్టీ. ఆ పార్టీతో కలసి అడుగులు వేయాలన్న పవన్ ఆలోచనలు కూడా చాలా దూరదృష్టితో కూడుకున్నవే అని అంటున్నారు. అలా బీజేపీకి పవన్ క్లోజ్ కావడం వల్ల రెండిందాలుగా లాభాలు ఉన్నాయని అంటున్నారు.
రాజకీయంగా చూస్తే పవన్ లో పరిపక్వత చాలా పెరిగింది అని అంటున్నారు. ఆయన ఒక్కో సభలో మాట్లాడుతున్న తీరు ఆయనలో రాజకీయ అనుభవం తెలియచేస్తోంది అంటున్నారు. ఇటీవల విజయవాడ పుస్తకావిష్కరణ సభలో పవన్ మాట్లాడిన విషయాలు కూడా అందరినీ ఆలోచింపచేసేలా ఉంటే రాజమండ్రిలో ఒక సినిమా ఫంక్షన్ లో ఆయన చేసిన ఉపన్యాసం మరో తీరుగా సాగింది అని అంటున్నారు.
ఇలాగే ప్రతీ ఇష్యూ మీద పవన్ తనదైన మార్క్ ఉండేలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. ఇక పార్టీ విస్తరణలో భాగంగా ఆయన కొత్త ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు. రాయలసీమ రాజకీయాలలో బలంగా ఉన్న రెడ్లను జనసేన వైపు లాగాలని ఆయన చూస్తున్నారు అని అని కూడా చెబుతున్నారు.
అదే విధంగా టీడీపీకి నమ్మకమైన మిత్రుడిగా ఉంటూ టీడీపీ అనుకూల మీడియా నుంచి పూర్తి స్థాయ్లో సపోర్టు తీసుకోవడంలో పవన్ రాజకీయ చాతుర్యం కనిపిస్తోంది అంటున్నారు. టీడీపీని తప్ప మరో పార్టీని నెత్తికెత్తుకోని అనుకూల మీడియా పవన్ గురించి కూడా మంచిగా ఉంటోంది అంటే దానికి కారణం పవన్ రాజకీయ తెలివిడే కారణం అంటున్నారు. ఏది ఏమైనా అధికారంలోకి రాక ముందు ఒక లెక్క వచ్చాక మరో లెక్క అన్నట్లుగా పవన్ ఎదిగిపోతున్నారు అని విశ్లేషణలు అయితే ఉన్నాయి.