కింగ్ మేకర్ చాన్స్ మిస్ చేసుకున్న పవన్...!
దీని మీద మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణా రావు అయితే పవన్ చాలా పెద్ద తప్పు చేశారు అని అంటున్నారు.
రాజకీయాలో ఎపుడూ ఆలోచనలు వ్యూహాలే విజయపధానికి చేరుస్తాయి. ఒకే ఒక్క డెసిషన్ అందలం ఎక్కిస్తుంది. అథో పాతాళానికి కూడా తొక్కేస్తుంది. రాజకీయాల్లో జనసేన అధినేత చారిత్రాత్మకమైన తప్పు చేస్తున్నారా అన్న చర్చ చాలా కాలంగా సాగుతోంది.
పవన్ కి అసలు ఈసారి ఎన్నికలు ఎంతో ఉపయోగపడేవి అన్నవి చాలా మంది భావన. అయితే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబుతో కలసి నడవడం వల్ల ఆయన చాలా నష్టపోయారు అని అంటున్నారు. ఏపీలో రెండు పార్టీలను జనాలు చూశారు. టీడీపీ వైసీపీ పనితీరుని చూసిన వారికి జనసేన మూడవ ఆల్టర్నేషన్ గా కచ్చితంగా కనిపిస్తుంది.
అయితే అలా థర్డ్ ఫోర్స్ గా జనసేనను జనంలో ఉంచడంతో పవన్ విఫలం అయ్యారని మేధావులతో సహా అంతా అంటున్నారు. దీని మీద మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ క్రిష్ణా రావు అయితే పవన్ చాలా పెద్ద తప్పు చేశారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి జనసేనతో పొత్తు చారిత్రాత్మకం అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్న నేపధ్యం ఉంది.
నిజానికి నాణేనికి అవతల వైపు చూస్తే టీడీపీతో పొత్తు జనసేన చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం అని అంటున్నారు. బీజేపీ నాయకుడు కూడా అయిన ఐవైఆర్ క్రిష్ణారావు అయితే జనసేన టీడీపీ పొత్తు ముమ్మాటికీ పవన్ కి చేటు చేసేదే అని తేల్చేశారు.
ఈ పొత్తు పవన్ కళ్యాణ్ కి జనసేనకు ఏ మాత్రం ఉపయోగపడదు అని అంటున్నారు. అంతే కాదు పవన్ రాజకీయ ఆకాంక్షలను ఏ మాత్రం కూడా ముందుకు సాగనీయదు అని అంటున్నారు. పవన్ పెద్ద తప్పు చేసారు అని ఆయన విశ్లేషించారు. పవన్ నిజంగా గోల్డెన్ చాన్స్ ని మిస్ చేసుకున్నారు అని కూడా క్రిష్ణారావు అనడం విశేషం.
పవన్ సొంతంగా నిలబడి ఉంటే ఏపీ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఈ టైం లో ఉండేవారు అని క్రిష్ణారావు అంటున్నారు. ఏపీలో ఇపుడు కావాల్సినంత రాజకీయ శూన్యత ఉందని ఆయన అంటున్నారు. అటు అధికార వైసీపీకి ఇటు టీడీపీకి మధ్యలో జనసేన పూర్తి స్థాయిలో తన బలాన్ని చాటుకుని ముందుకు పోవడానికి కూడా చాన్స్ ఉండేదని ఆయన అంటున్నారు.
ఏపీలో కోట్లాది మంది ప్రజలు నిజమైన మార్పు కోసం ఎదురుచూస్తున్నారు అని ఆయన చెప్పడం విశేషం. ఆ మార్పు వైసీపీ టీడీపీలు కాకుండా కొత్తగా రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు.
అందువల్ల జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే ప్రజలు తప్పకుండా జనసేను గెలిపించుకునేవారు అని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు. జనసేన ఏపీలో ఒంటరిగా పోటీ చేసి ఉంటే మంచి నంబర్ లో సీట్లు రావడమే కాకుండా ఏపీలో హంగ్ అసెంబ్లీకి ఈ పరిణామం దారి తీసేదని ఆయన విశ్లేషించారు.
దాని ఫలితంగా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవతారం ఎత్తేవారని, అది అంతిమంగా ఆయన కింగ్ అయ్యే చాన్స్ కూడా చేసేది అని కూడా చెప్పుకొచ్చారు. అయితే టీడీపీతో పొత్తు బంధం పెట్టుకుని పవన్ తనకు దక్కబోయే అద్భుతమైన అవకాశాలను పోగొట్టుకున్నారని ఐవైఆర్ అంటున్నారు.
తన చేతిలోని తుపాకీని దించేసి పవన్ రాజకీయంగా బాగా తగ్గిపోయారు అని కూడా ఐవైఆర్ అంటున్నారు. టీడీపీ యువగళం సభలో పవన్ పాల్గొనడం ద్వారా తనను తాను తగ్గించేసుకున్నారు అని కూడా అంటున్నారు. మొత్తానికి పవన్ రాజకీయం గురించి ఏపీ పాలిటిక్స్ గురించి జనసేన గురించి ఎంతో వివరించిన ఐవైఆర్ తాను ఉన్న బీజేపీ ఏపీలో ఏ మేరకు పెర్ఫార్మెన్స్ ఈ ఎన్నికల్లో చేస్తుంది అన్న దానికి మాత్రం చిత్రమైన సమాధానం ఇచ్చారు.
ఏపీలో బీజేపీ థర్డ్ ఫోర్స్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది కానీ అది ఈ ఎన్నికలలో సఫలం కాకపోవచ్చు ఎందుకంటే ఏపీ బీజేపీలో ఈ రోజుకీ సరైన నాయకత్వం లేదని ఆయన అంటున్నారు. మొత్తానికి జనసేనాని మంచి చాన్స్ పోగొట్టుకున్నారు అన్నది మాత్రం ఐవైఆర్ బలమైన అభిప్రాయంగా ఉంది.