ట్రంప్ కు బ్యాడ్ న్యూస్ చెప్పిన పోల్స్... కమలకు సరికొత్త రిక్వస్ట్!

అయితే ఎప్పుడైతే జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకుని కమలా హారీస్ కు ఆ అవకాశం వచ్చిందో అప్పటి నుంచి లెక్కలు కొంచెం కొంచెం మారుతూ వస్తున్నాయి.

Update: 2024-08-09 05:11 GMT

ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి తీవ్రమవుతోంది. ప్రధానంగా ట్రంప్ పై కాల్పుల ఘటన అనంతరం ఈ వాతావారణం మరింత వేడెక్కింది. అయితే ఎప్పుడైతే జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకుని కమలా హారీస్ కు ఆ అవకాశం వచ్చిందో అప్పటి నుంచి లెక్కలు కొంచెం కొంచెం మారుతూ వస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా ఐ.పీ.ఎస్.వో.ఎస్. పోల్ ఫలితాలు ట్రంప్ కు షాకిచ్చాయి.

అవును... జోబైడెన్ డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో జరిగిన డిబేట్ లో ట్రంప్ దూసుకెళ్లారు. ఆ డిబెట్ లో జో బైడెన్ తడబడ్డారనే కామెంట్లు వినిపించాయి. దీంతో... ట్రంప్ వర్గంలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇదే సమయంలో ఆయనపై కాల్పుల ఘటన జరగడంతో ట్రంప్ కు మద్దతు మరింత పెరిగిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక అతడికి అడ్డులేదనే కామెంట్లూ వినిపించాయి.

సరిగ్గా ఈ సమయంలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఖారారైంది. అక్కడ నుంచి డెమోక్రటిక్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. విరాళల సేకరణ, ఎన్నికల ర్యాలీలతో ఆమె దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్నటివరకూ ట్రంప్ కు అతి సమీపంలో కమలా హారీస్ ఉన్నారనే మాటల నడుమ.. తాజాగా ట్రంప్ ను దాటి కమలా హారీస్ మద్దతు సంపాదించినట్లు సర్వేలు చెబుతున్నాయి.

ఇందులో భాగంగా... ఐ.పీ.ఎస్.ఓ.ఎస్. పోల్ ఫలితాల ప్రకారం ట్రంప్ కు 37 శాతం ఆదరణ ఉండగా.. కమల హారిస్ కు 42శాతం ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో అమెరికా వ్యాప్తంగా 2,045 మందిపై ఈ సర్వే నిర్వహించినట్లు చెబుతున్నారు. దీంతో.. డెమోక్రటిక్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త సందడి కనిపిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తన వైఖరి మార్చుకున్న ట్రంప్.. కమల తో డిబేట్ కు అంగీకరించారు.

గతంలో కమలా హారీస్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత ఆమెతో డిబేట్ కు ట్రంప్ అంగీకరించలేదు. అసలు తనతో చర్చించే స్థాయి ఆమెకు లేదంటూ కొట్టిపారేశారు. అయితే... తాజా సర్వే ఫలితాల్లో వచ్చిన మార్పుతో డొనాల్డ్ ట్రంప్.. కమలా హారీస్ తో డిబెట్ కు అంగీకరించారు. ఈ మేరకు ఆమెతో వచ్చే నెలలో మూడు టీవీల్లో చర్చకు సిద్ధపడుతున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా... సెప్టెంబర్ 4, 10, 25 తేదీలలో మూడు టీవీల్లో తనతో చర్చకు రావాలని డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. అందుకు కమలా హారీస్ అంగీకరిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో.. సర్వే ఫలితాలకు తగ్గట్టుగానే డిబేట్ లో కమల దూకుడు ప్రదర్శిస్తారా.. లేక, ఈసారీ ట్రంపే పై చేయి సాధిస్తారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News