ఆర్థిక అసమానతలు పెరగడానికి కారణాలేంటో తెలుసా?

దేశంలో సంపద కొద్ది మంది చేతిలోనే ఉంటోంది. దీంతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి.

Update: 2024-03-21 07:03 GMT

దేశంలో సంపద కొద్ది మంది చేతిలోనే ఉంటోంది. దీంతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. సుమారు 40 శాతం దేశ సంపద 22 శాతం ఆదాయం ఒక శాతం మంది చేతిలోనే ఉంటోందని వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. దేశంలో అసమానతలు అసమతుల్యంగా ఉంటున్నాయి. దీంతో సంపద కొద్ది మంది చేతుల్లోనే మూలుగుతోంది. డబ్బు విలువ తెలిసినా దాన్ని సంపాదించే మార్గాలు పేద వారికి తెలియడం లేదు. దీంతోనే డబ్బు కొందరి చేతుల్లోనే మిగిలిపోతోంది.

2000 సంవత్సరం నుంచి అసమానతలు ఎక్కువవుతున్నాయి. 2014-15 నుంచి 2022-23 మధ్య ఇంకా పెరిగింది. దీంతో సంపద కలిగిన కుటుంబాలు రెండు శాతం మేర ట్యాక్స్ విధిస్తున్నారు. దేశానికి 0.5 శాతం అదనపు ఆదాయం వస్తుంది. కానీ పేద వారి సంఖ్య మాత్రం నానాటికి పెరుగుతూనే ఉంది. ఆర్థిక అసమానతల మధ్య అభాగ్యుల జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

స్వాతంత్ర్యానికి పూర్వం ఆర్థిక అసమానతలు అంతగా ఉండేవి కావు. ఇప్పుడే వేగంగా విస్తరిస్తున్నాయి. తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదని తెలిసినా సంపద మాత్రం కొద్ది మంది చేతిలోనే మూలుగుతోంది. దీంతో దాచుకున్న ధనానికి విలువ ఉండటం లేదు. ధనమైనా తెలివైనా నలుగురికి పంచితేనే సార్థకత అని తెలిసినా చాలా మంది ధనాన్ని పెట్టెల్లోనే మూలిగేలా చేస్తున్నారు.

ధనవంతులు కొద్ది మందే ఉంటున్నారు. కానీ పేదవారు మాత్రం పెరుగుతున్నారు. దారిద్ర్యం ఎక్కువవుతోంది. మూడు పూటల తిండి దొరకని వారే అధికంగా ఉంటున్నారు. సంపద కలిగిన కుటుంబాలు వేళ్ల మీదే లెక్కించొచ్చు. పేదవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోజురోజుకు ఐదు వేళ్లు లోపలికి వెళ్లని వారు చాలా మంది తయారవుతున్నారు.

ధనవంతులు ఇంకా డబ్బున్న వారిగానే మారుతున్నారు. డబ్బు లేని వారి జీవితాలు మధ్యలోనే ఊగిసలాడుతున్నాయి. డబ్బు సంపాదనలో విలువలు పాటిస్తే ధనవంతులు కావడం జరగదు. అక్రమ మార్గాలు అనుసరిస్తేనే డబ్బు సంపాదన పెరుగుతుంది. ఫలితంగా ధనవంతులుగా అవతారమెత్తడం ఖాయం. విలువలు పాటించేవారు మాత్రం కిందే ఉంటున్నారు.

Tags:    

Similar News