హాసన సెక్స్‌ కుంభకోణం.. ప్రజ్వల్‌ మాజీ డ్రైవర్‌ కీలక వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ మాజీ డ్రైవర్‌ కార్తీక్, బీజేపీనేత దేవరాజే గౌడల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... వాటిని నువ్వంటే నువ్వే లీక్‌ చేశావంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గమనార్హం.

Update: 2024-05-01 04:06 GMT

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణకు సంబంధించినట్లుగా చెబుతోన్న "ఆ" వీడియోలు వైరల్‌ గా మారడం.. ఆ విషయం కాస్తా కన్నడ రాజకీయాల్లో పెను దుమారం రేపడం.. ప్రజ్వల్‌ పై జేడీఎస్‌ ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేయడం.. షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం తెలిసిందే. ఇప్పుడు కన్నడ నాట ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఈ సమయంలో... ఆ వీడియోలు బయటకు రావడంపై ప్రజ్వల్ మాజీ డ్రైవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

అవును.. సుమారు మూడు వేల వరకూ ఉన్నాయని.. అవన్నీ ప్రజ్వల్ కు సంబంధించిన వీడియోలని అంటున్న నేపథ్యంలో... అసలు ఆ వీడియోలను ఎవరు లీక్‌ చేశారనే చర్చ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కుమార స్వామి కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారు కూడా. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ మాజీ డ్రైవర్‌ కార్తీక్, బీజేపీనేత దేవరాజే గౌడల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... వాటిని నువ్వంటే నువ్వే లీక్‌ చేశావంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం గమనార్హం.

ఈ క్రమంలో ఈ విషయామపై స్పందించిన ప్రజ్వల్‌ రేవణ్ణ మాజీ డ్రైవర్ కార్తీక్... అతని వద్ద 15 ఏళ్లపాటు డ్రైవర్‌ గా పని చేసినట్లు చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఈ క్రమంలో... ఓ ఏడాది నుంచి ప్రజ్వల్‌ దగ్గర ఉండటం లేదదని చెబుతూ... తన భూమిని లాక్కున్నారని తెలిపాడు. ఇదే సమయంలో తన భార్యపై చేయి కూడా చేసుకున్నారని, తనను మానసికంగా వేధించారని వెల్లడించారు.

ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ దేవేగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బీజేపీనేత దేవరాజే గౌడ వద్దకు వెళ్లినట్లు తెలిపాడు. అదేవిధంగా... 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హోళెనరసీపుర స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దేవరాజే గౌడ.. రేవణ్ణ చేతిలో ఓడిపోయారు అని గుర్తు చేసిన కార్తీక్.. ఇదే సమయంలో అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు నేను విడుదల చేయకుండా ప్రజ్వల్‌ స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నారని చెప్పుకొచ్చాడు.

ఈ సమయంలోనే... వాటిని తనకు అప్పగించేస్తే న్యాయస్థానానికి ఇచ్చి స్టే ఆర్డర్‌ ఎత్తివేయిస్తానని దేవరాజే గౌడ తనకు హామీ ఇచ్చారని చెప్పిన కార్తీక్... ఆయనపై నమ్మకం ఉంచి వాటిని అయనకు ఇచ్చేసినట్లు తెలిపారు. అయితే... ఆయన తనను మోసం చేశాడని కార్తిక్‌ ఆరోపించాడు. ఇదే సమయంలో ఆ వీడియోలను దేవరాజేకు మినహా కాంగ్రెస్‌ నేతలకు కానీ, ఇతరులకు కానీ ఇవ్వలేదని అన్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ప్రజ్వల్ మాజీ డ్రైవర్ కార్తీక్ వ్యాఖ్యలపై దేవరాజే స్పందించారు.. ఆ ఆరోపణలనుతోసిపుచ్చారు. కాంగ్రెస్‌ నేత, హసన లోక్‌ సభ అభ్యర్థి శ్రేయస్‌ పాటిల్‌ తో కార్తీక్ తిరుగుతున్నాడని ఆరోపించారు. ఇదే క్రమంలో.. జేడీఎస్‌, బీజేపీ నేతలెవరూ ఆ వీడియోలు విడుదల చేయలేదని తెలిపారు. ఇదే సమయంలో... సిట్‌ నోటీసుల కోసం వేచిచూస్తున్నానని.. వారికి తనదగ్గరున్న ఆధారాలు అప్పగిస్తానని అన్నారు.

Tags:    

Similar News