పులివెందులకు ఉపఎన్నిక.. ఏపీ డిప్యూటీ స్పీకర్ సంచలనం!

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఉప ఎన్నిక రానుందన్న అంచనా చెప్పుకొచ్చారు.

Update: 2025-02-04 04:14 GMT

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు ఉప ఎన్నిక రానుందన్న అంచనా చెప్పుకొచ్చారు. అయితే.. ఇందుకు కండీషన్స్ అప్లై అన్న ఆయన. కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ వరుసగా అరవై రోజులు అసెంబ్లీకి డుమ్మా కొడితే.. ఆయన అసెంబ్లీ సభ్యత్వం దానంతట అదే రద్దు అవుతుందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మీడియాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పలు అంశాల మీద మాట్లాడిన రఘురామ.. ప్రతిపక్ష హోదా కోసం జగన్ కోర్టులో కేసు ఉన్నప్పటికీ.. అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు.. సదరు కేసుకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఏ శాసన సభా సభ్యుడైనా.. అసెంబ్లీకి రాకపోయినా.. సహేతుగా కారణాలతో సెలవు అభ్యర్థన ఇవ్వాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలసింది ప్రజలే తప్పించి స్పీకర్ కాదన్న ఆయన.. ‘‘అసెంబ్లీకి వచ్చి సంతకం చేసి వెళ్లిపోవచ్చు. అలా చేయటం ద్వారా తన సీటును కాపొడుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి సెలవు అభ్యర్థన ఇవ్వలేదన్న రఘురామ.. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాకపోతే మాత్రం తప్పనిసరిగా పులివెందులకు తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందన్నారు. డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న రఘురామ చెబుతున్న మాటల్లో నిజం లేకపోలేదు. అలా అని.. మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి పదవిని పీకి సాధించేదేమిటి? అన్నది ప్రశ్న. అంతేకాదు.. గత ప్రభుత్వ హయాంలో తాను అసెంబ్లీలో అడుగు పెట్టనంటూ శపథం చేసి మరీ.. రాకుండా ఉన్న చంద్రబాబు ఎమ్మెల్యే సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు కావాలి కదా? అలా ఎందుకు జరగలేదు? అన్నది ప్రశ్న. ఇవేమీ ఆలోచించకుండా తాను లక్ష్యంగా చేసుకున్న వారిపై చేసే వ్యాఖ్యలు తనకున్న హోదాకు సరిపోయేలా ఉన్నాయా? లేదా? అన్నది ఆలోచించారా? లేదా?

వ్యవస్థను శాసించే నిబంధనల ఏర్పాటు లక్ష్యాన్ని.. స్ఫూర్తిని మర్చిపోకూడదు. అనవసరంగా చట్టాన్ని బయటకు లాగి.. ఏదో సాధిద్దామన్న తొందరతో నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినే ప్రమాదం ఉంటుందన్నది మర్చిపోకూడదు. అందుకే.. సంచలనాల కోసం కాకుండా.. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయాల అమలు ఉండాలన్నది మర్చిపోకూడదు. ఈ విషయాన్ని రఘరామ ఆలోచిస్తున్నారా? లేదా? అన్నదే అసలు ప్రశ్న.

Tags:    

Similar News