ఉండిలో రఘురామ నామినేషన్ దాఖలు... జగన్ పై కీలక వ్యాఖ్యలు!
అవును... తాజాగా మీడియాతో మాట్లాడిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు... ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు.
ఏపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. పైగా నరసాపురం ఎంపీ స్థానానికి కూటమి తరుపున బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మకు పార్టీ బీ-ఫారం ఇచ్చిన నేపథ్యంలో... ఆ టిక్కెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు కనిపించిన రఘురామ కృష్ణంరాజు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలో ఉండి టిక్కెట్ ను కన్ ఫాం చేశారు రఘురామ!
అవును... తాజాగా మీడియాతో మాట్లాడిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు... ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా తన గెలుపు ఖాయమని చెప్పుకొచ్చారు. బీజేపీ తరుపున నరసాపురం టిక్కెట్ ఆశించినా.. కొన్ని అనివార్య కారణాలవల్ల టిక్కెట్ దక్కలేదని తెలిపారు. ఈ సమయంలో ఈ రోజు తన తరుపున, తన కుమారుడు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన తాను నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజుని స్వయంగా కలిసి తన విజయానికి సహకరించాలని అభ్యర్థిస్తానని తెలిపారు! ఈ సందర్భంగా జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రఘురామ కృష్ణంరాజు!
ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ప్రముఖ నాయకుడి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఓడించడానికి సిద్ధపడుతున్నారంటూ ప్రచారంలో ఉన్నారన్నట్లుగా ఎదురైన ప్రశ్నకు స్పందించిన రఘురామ... వైసీపీలో జగన్ తప్ప మరో ప్రముఖ నాయకుడు లేరని అన్నారు. ఇక అతని కుటుంబ సభ్యుల విషయానికొస్తే... "తల్లి వదిల్సింది, చెల్లి వదిలేసింది.. తల్లీ, చెల్లీ ఏ గల్లీలోని సిల్లినా కొడుకుని అన్నట్లు... ఉన్నది ఇక తన భార్య" అని అన్నారు!
ఏది ఏమైనా... అధికారికంగా ఇంకా అభ్యర్థి ప్రకటన రాలేదని అంటున్న నేపథ్యంలో రఘురామ కృష్ణంరాజు తరుపున నామినేషన్ దాఖలవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రామరాజు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది!