రతన్ టాటా సాధించిన విజయాలను ప్రతిబింబించే అవార్డ్స్ ఇవే!

ఈయన మరణ వార్తను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధృవీకరించారు.

Update: 2024-10-10 04:50 GMT

ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ గ్రహీత, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్, భారత పారిశ్రామిక రంగానికి టైటాన్ “రతన్ టాటా” (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్తను టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధృవీకరించారు.

అవును... 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా - సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్కే డిగ్రీ పట్టా పోందినప్పటి నుంచి.. 2008లో పద్మవిభూషణ్ ను అందుకునే వరకూ ఆయన విజయాలను ప్రతిబింబించే అవార్డ్స్ ఎన్నో!

వ్యాపారవేత్తగా, పరోపకారిగా రతన్ టాటా సాధించిన విజయాలను ప్రతిబింబించే అవార్డులను ఇప్పుడు చూద్దాం...! ఈ పట్టికలో.. సంవత్సరం - అవార్డు - అవార్డింగ్ బాడీ వివరాలు ఉన్నాయి.

2000 - పద్మ భూషణ్ - భారత ప్రభుత్వం

2001 – బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ గౌరవ డాక్టర్ - ఒహియో స్టేట్ యూనివర్సిటీ

2004 – ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే పతకం - లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్

2007 - దాతృత్వ కార్నెగీ మెడల్ - అంతర్జాతీయ శాంతి కోసం కార్నేగీ ఎండోమెంట్

2008 - పద్మవిభూషణ్ - భారత ప్రభుత్వం

2008 - గౌరవ డాక్టర్ ఆఫ్ లా – కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ

2008 - గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ - ఐఐటీ ముంబయి

2008 - గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ - ఐఐటీ ఖరగ్ పూర్

2008 - గౌరవ పౌర పురస్కారం – సింగపూర్ ప్రభుత్వం

2008 - గౌరవ ఫెలోషిప్ - ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ

2008 – ఇన్ స్పైర్డ్ లీడర్ షిప్ అవార్డ్ – ఇండియన్ అఫైర్స్ ఇండియా లీడర్ షిప్ కాన్ క్లేవ్

2013 - ఎర్నెస్ట్ & యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ - ఎర్నెస్ట్ & యంగ్

2013 - గౌరవ డాక్టర్ ఆఫ్ బిజినెస్ ప్రాక్టీస్ - కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం

2014 - గౌరవ డాక్టర్ ఆఫ్ బిజినెస్ – సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ

2014 - సాయాజీ రత్న అవార్డ్ - బరోడా మేనేజ్మెంట్ అసోసియేషన్

2014 - గౌరవ నైట్ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ - క్వీన్ ఎలిజబెత్ II

2014 - గౌరవ డాక్టర్ ఆఫ్ లాస్ – యర్క్ యూనివర్సిటీ, కెనడా

2015 – ఆటోమోటివ్ ఇంజినీరింగ్ గౌరవ డాక్టర్ – క్లెంసన్ యూనివర్సిటీ

2015 - సాయాజీ రత్న అవార్డ్ - బరోడా మేనేజ్మెంట్ అసోసియేషన్, పారిస్

2016 – కమాండర్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ – ఫ్రాన్స్ ప్రభుత్వం

2018 - గౌరవ డాక్టరేట్ - స్వాన్సీ యూనివర్సిటీ

2021 - అస్సాం బైభవ్ - అస్సాం ప్రభుత్వం

2022 - సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ - హెచ్.ఎస్.ఎన్.సి. యూనివర్సిటీ

2023 – ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గౌరవ అధికారి - కింగ్ చార్లెస్ III

2023 - ఉద్యోగ రత్న - మహారాష్ట్ర ప్రభుత్వం

Tags:    

Similar News