రిషికొండ సిత్రాలు అన్నీ ఇన్నీ కాదు.. ఇంతకూ ఆ ఫైల్స్ ఎక్కడ?

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ల వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయ్యిందనేది తెలిసిన విషయమే.

Update: 2024-11-12 05:02 GMT

గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ల వ్యవహారం ఎంత చర్చనీయాంశం అయ్యిందనేది తెలిసిన విషయమే. అసలు ఆ ప్యాలెస్ ఎలా నిర్మించారు.. ఆ గదుల లోపల సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. మొదలైన విషయాలు కూటమి ప్రభుత్వ కొలువు దీరిన తర్వాత బయట ప్రపంచంలోకి వచ్చాయి. ఈ సమయంలో మరిన్ని విషయాలు తెరపైకి వచ్చాయి.

అవును... కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రిషికొండ ప్యాలెస్ గురించిన విషయాలు కథలు కథలుగా చర్చకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ ప్యాలెస్ లలో ఉన్న మరికొన్ని లగ్జరీ విషయాలతో పాటు.. వీటికి సంబంధించి ఫైల్స్ మాయమయ్యాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇది ఈ నిర్మాణాల విషయంలో మారో హాట్ టాపిక్ గా మారింది.

ఇదే సమయంలో... రుషికొండ ప్యాలెస్ లో వాడిన ప్రధాన ద్వారం తలుపు, కమోడ్, బాత్ టబ్ లకు అయిన ఖర్చు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా... మెయిన్ డోర్ కు రూ.31.84 లక్షలు ఖర్చు పెట్టగా... ఇతర తలుపులు ఒక్కోదానికీ రూ.17.93 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

అదేవిధంగా... బాత్ రూం లలోని ఒక్కో బాత్ టబ్ కు పెట్టిన ఖర్చు రూ.12.38 లక్షలు కాగా.. వాష్ బేసిన్ కి పెట్టిన ఖర్చు రూ.2.61 లక్షలని అంటున్నారు. ఇదే సమయంలో కాన్ ఫరెన్స్ టేబుల్ ఖర్చు సుమారు రూ.25 లక్షలు కాగా... ఇంగ్లిష్ లెటర్ "యూ" ఆకారంలోని టెబుల్ ఖర్చు రూ.53.73 లక్షలని అంటున్నారు!

మాయమైన ఫైల్స్!:

ఆ సంగతి అలా ఉంటే... రుషికొండ ప్యాలెస్ కి సంబంధించిన పలు కీలక ఫైళ్లు మాయమైనట్లు చెబుతున్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల ఫైళ్లు, సైట్ లో ఉన్న ఎన్ క్లోజర్స్ క్లియరెన్స్ కు సంబంధించిన ఫైళ్లు మాయమైనవాటిలో కీలకమైనవని అంటున్నారు. ఇదే సమయంలో సుమారు రూ.50 కోట్ల విలువైన వస్తువులు, పరికరాలు కనిపించకుండా పోయాయని చెబుతున్నారు.

Tags:    

Similar News