కిలో రూ.5 లక్షలుండే కుంకుమ పువ్వు నేల ఇరాన్.. ఈ ప్రత్యేకత తెలుసా?

చూడగానే ఆకట్టుకునే రంగులో ఉండే కుంకుమ పువ్వు ప్రస్తుతం రికార్డు ధర పలుకుతోంది. కిలో రూ.5 లక్షలకు చేరింది. ఈ పంట 90 శాతం ఇరాన్ లోనే పండుతుంది.

Update: 2024-05-20 14:30 GMT

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంట అది.. కానీ, అన్నిచోట్లా పండుతుందని చెప్పలేం.. మనం మిరప పంటను ఎర్ర బంగారం అంటూ ఉంటాం.. కానీ, అసలైన ఎర్ర బంగారం కుంకుమ పువ్వు. దాని కిలో ధర రూ.5 లక్షలుంది ఇప్పుడు. మన దేశంలో కశ్మీర్ లో మాత్రమే పండుతుంది కుంకుమ పువ్వు. అయితే, ప్రపంచంలో ఒక దేశం మాత్రమే 90శాతం కుంకుమ పువ్వును ఉత్పత్తి చేస్తుంది.

పండేది మొత్తం అక్కడే..

చూడగానే ఆకట్టుకునే రంగులో ఉండే కుంకుమ పువ్వు ప్రస్తుతం రికార్డు ధర పలుకుతోంది. కిలో రూ.5 లక్షలకు చేరింది. ఈ పంట 90 శాతం ఇరాన్ లోనే పండుతుంది. అందుకే ఇరాన్ ను కుంకుమ పువ్వు నేల అంటారు. అలాంటి ఇరాన్ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలున్నాయి. యూరప్ ప్రభావంతో 50 ఏళ్ల కిందటే ఫారిన్ కల్చర్ కు అలవాటుపడింది. ఒకవేళ అదే కొనసాగి ఉంటే ఇప్పుడు ఎక్కడో ఉండేది. కానీ, 1970ల తొలినాళ్లలో ఇస్లామిక్ విప్లవంతో అంతా మారిపోయింది. ఆయతుల్లా ఖొమైనీ సుప్రీం లీడర్ అయ్యారు. ఇరాన్ కు దేశాధ్యక్షుడు ఉన్నా ఖొమైనీ మాటే శాసనం.

రెండు సైన్యాలు..

ఏ దేశానికైనా ఒకటే సైన్యం ఉంటుంది. కానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్స్ఫ్ (ఐఆర్జీసీ) పేరిట సమాంతర సైన్యాన్ని నడుపుతోంది. ఐఆర్జీసీకి త్రివిధ దళాలు ఉండడం మరో ప్రత్యేకత. కాగా, ఇటీవల ఈ దళాలపైనే ఇటీవల ఇజ్రాయెల్ దాడి చేసింది. 15 మంది వరకు గార్డ్స్ ను హతమార్చింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులకు దిగింది.

రెండేళ్ల కిందట హిజాబ్ వివాదం..

దాదాపు రెండేళ్ల కిందట ఇరాన్ లో హిజాజ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. హిజాబ్ ధరించలేదని ఓ యువతిని తీవ్రంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. ఆపై ఇది పెద్దఎత్తున నిరసనలకు దారితీసింది. క్రమంగా ఆ నిరసనలు చల్లారినా.. ఇరాన్ లో ఇప్పటికీ పాశ్చాత్య అనుకూల ధోరణుల అణచివేత కొనసాగుతోందని స్పష్టమైంది.తాజాగా ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంతో ఆ దేశం వార్తల్లో నిలిచింది.

Tags:    

Similar News