టీటీడీ ఆఫీసుపై దాడి కేసులో ఇది మామూలు ట్విస్ట్ కాదు!
వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ దాడి కేసులో సోమవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసుతో తనకు సంబంధం లేదని ఫిర్యాదుదారుడే అఫిడవిట్ సమర్పించారు. దీంతో... ఈ విషయం సంచలనంగా మారింది.
అవును... గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరైన ఫిర్యాదుదారుడు సత్యవర్థన్.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని అఫిడవిట్ సమర్పించారు. దీంతో.. వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీసులో ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు కేసు నమోడు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు 88 మందిని నిందితులుగా చేర్చారు. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు 45 మందిని అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో.. వంశీ సహా మరికొంతమంది బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే.. కింది కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం సూచించగా.. వీరంతా విజయవాడలోనే పిటిషన్లు దాఖలు చేశారు! ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కేసుల న్యాయస్థానంలో వాటిపై వాదనలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... కోర్టుకు హాజరైన సత్యవర్థన్.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని.. ఆ సంఘటన జరిగిన సమయంలో అసలు తాను అక్కడ లేనని.. పోలీసులు బలవంతం చేసి, సాక్షిగా పిలిచి సంతకం చేయించుకున్నారని న్యాయమూర్తికి చెప్పారు.
ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి తనకు రక్షణ కల్పించాలని.. తాను ఈ కేసును ఉపసంహరించుకుంటానని కోర్టుకు తెలిపారు! దీంతో... తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేయగా... నెక్స్ట్ ఏమి జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది.