నామినేషన్ల వేళ టీడీపీ కీలక మార్పులు

ఉండి నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ టికెట్ ఖరారయింది.

Update: 2024-04-21 10:31 GMT

నామినేషన్ల దాఖలుకు మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్న ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే అన్ని పార్టీల నుండి పోటీ చేస్తున్న వారు నామినేషన్లు వేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా 144 శాసనసభ స్థానాల నుండి టీడీపీ పోటీ చేస్తున్నది. ఇది వరకే అభ్యర్థులను కూడా ప్రకటించిది. అయితే తాజాగా నాలుగు నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది.

ఉండి నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ టికెట్ ఖరారయింది. అయితే నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు టీడీపీలో చేరడం, నరసాపురం ఎంపీ టికెట్ పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిన నేపథ్యంలో ఆయనకు రామరాజు స్థానంలో ఉండి టికెట్ ఖరారు చేశారు. ఇక మడకశిర నుండి మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ ను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా టీడీపీలో కీలకంగా ఉన్న ఎంఎస్ రాజును అక్కడి నుండి బరిలోకి దింపనున్నారని సమాచారం.

ఎంఎస్ రాజుకు బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వాలని అనుకున్నా అక్కడి నుండి మాజీ ఐఎఎస్ క్రిష్ణప్రసాద్ ను బరిలోకి దింపిన నేపథ్యంలో రాజుకు ఇక్కడి నుండి సర్ధుబాటు చేస్తున్నారు. పాడేరు అభ్యర్థి కిల్లు వెంకట రమేష్ నాయుడు పట్ల పార్టీ శ్రేణులు అనాసక్తిగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుండి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పోటీకి దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక వెంకటగిరి నుండి మహిళా కోటా కింద మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణకు బదులుగా ఆయన కూతురు లక్ష్మి సాయిప్రియను ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం వైసీపీ నుండి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ పోటీ చేయనున్న నేపథ్యంలో రామక్రిష్ణను టీడీపీ నుండి బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మార్పులతో ఈ రోజు వీరందరికీ పార్టీ బీఫారంలు అందజేయనున్నట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News