ఆసక్తికరంగా టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా!
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గతంలో ఎన్నడూ లేనంతగా అన్నట్లుగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఎన్నికలు దగ్గరపడుతుండటంతో గతంలో ఎన్నడూ లేనంతగా అన్నట్లుగా అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు దూకుడు ప్రదర్శిస్తున్నారు. వీలైనంత తొందరగా అన్ని నియోజకవర్గాలకూ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పొత్తులో భాగంగా మిగిలిన 144 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ తొలివిడతలో 94, రెండో మిడతలో 34 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేశారు! ఇక మిగిలింది 16 అసెంబ్లీ స్థానాలు మాత్రమే. ఈ సమయంలో ఎంపీ జాబితాపైనా బాబు ఫైనల్ డెసిషన్ కి వచ్చేస్తున్నారని తెలుస్తుంది.
అవును... ఇక 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండటంతో... ఇదే సమయంలో పొత్తులో భాగంగా మిగిలిన 17 లోక్ సభ స్థానాలకూ అభ్యర్థులను ఎంపిక చేసే పని ఆల్ మోస్ట్ పూర్తయ్యిందని.. ఇంకా అతి తక్కువ స్థానాలపై మాత్రమే కసరత్తులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో ప్రధానంగా సామాజికవర్గాల వారీగా సీట్ల కేటాయింపుపైనా బాబు దృష్టి సారించారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... ఇప్పటివరకూ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో అత్యధికంగా కమ్మ సామాజికవర్గానికి 28, రెడ్లకు 28, ఎస్సీలకు 27, బీసీలకు 24, కాపులకు 8, క్షత్రియులకు 5, ఎస్టీలకు 4, మైనారిటీలకు 3, వైశ్యులకు 2, వెలమలకు 1 సీటు దక్కినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఎంపీ జాబితాలోనూ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్ని పేర్లు కన్ ఫాం అయ్యయని తెలుస్తుంది.
పొత్తులో భాగంగా బీజేపీలో ఆరు, జనసేనకు రెండు లోక్ సభ స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో భాగంగా అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారని తెలుస్తుండగా.. మచిలీపట్నం, కాకినాడ స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. కాకినాడ నుంచి పవన్ పోటీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది!
ఈ క్రమంలో ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం టిక్కెట్లు కన్ ఫాం అయిన టీడీపీ ఎంపీ క్యాండిడేట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి...
శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్ నాయుడు,
విశాఖపట్నం - మతుకుమిల్లి భరత్
విజయవాడ - కేశినేని శివనాథ్ (చిన్ని)
గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
నరసరావుపేట - లావు శ్రీకృష్ణదేవరాయలు
ఒంగోలు - మాగుంట రాఘవరెడ్డి
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు (ఎస్సీ) - దగ్గుమళ్ల ప్రసాదరావు
రాజంపేట - సుగవాసి బాలసుబ్రమణ్యం
నంద్యాల - బైరెడ్డి శబరి... పేర్లు కన్ ఫాం అయినట్లు తెలుస్తుండగా... ఇక మిగిలిన అమలాపురం, ఏలూరు, బాపట్ల, కర్నూలు, కడప, అనంతపురం, హిందూపురం స్థానాలపై బాబు కసరత్తులు ముమ్మరం చేశారని తెలుస్తుంది.