డేంజర్ బెల్స్... 12నెలల్లో 30 కోట్ల చిన్నారులకు లైంగిక వేధింపులు!

ఇందులో భాగంగా గడిచిన 12 నెలల్లోనే సుమారు 30 కోట్ల మంది పిల్లలు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నారని అంటున్నారు.

Update: 2024-05-27 05:11 GMT

ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులపై ఆన్ లైన్ వేదికగా లైంగిక వేదింపులు పెరిగిపోతున్నాయనే చర్చ నిత్యం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అది భారీ స్థాయిలో ఉందని చెబుతుంది తాజాగా అధ్యయనం. ఇందులో భాగంగా గడిచిన 12 నెలల్లోనే సుమారు 30 కోట్ల మంది పిల్లలు లైంగిక వేదింపులు ఎదుర్కొన్నారని అంటున్నారు.

అవును... గత 12 నెలల్లో 300 మిలియన్ల కంటే ఎక్కువమంది చిన్నారులు ఆన్‌ లైన్‌ లో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని ఎడిన్‌ బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇదే సమయంలో.. ప్రతి 8 మంది చిన్నారుల్లో ఒకరు వీటి బారిన పడుతున్నారని తెలిపారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని అధ్యయనం చేసిన యూనివర్సిటీ చైల్డ్‌ లైట్ గ్లోబల్ చైల్డ్ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

నివేదిక ప్రకారం.. లైంగిక చర్యల కోసం పెద్దలు, ఇతర యువకుల నుంచి అభ్యర్థనలు వంటి కేసులు కూడా ఇదే సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో వారి పర్సనల్ ఫోటోలను సీక్రెట్ గా ఉంచడానికి డబ్బులు డిమాండ్ చేయడం ఒకెత్తు అయితే.. దానికి అనుగుణంగా లైంగిక వేదింపులు జరుగుతున్నాయని అంటున్నారు.

ఈ సమస్యకు ఆదేశం, ఈ ప్రాంతం అనే తారతమ్యాలేమీ లేవు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది! అయితే ఈ విషయంలో యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేకించి అధిక ప్రమాదకర ప్రాంతం అని పరిశోధనలు సూచిస్తున్నాయని చెబుతున్నారు. అక్కడ ఉన్న తొమ్మిది మంది పురుషులలో ఒకరు ఏదో ఒక సమయంలో పిల్లలపై ఆన్‌ లైన్ నేరాన్ని అంగీకరించారట!

పశ్చిమ ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని క్రిమినల్ ముఠాలు ఆన్‌ లైన్‌ లో సెక్స్‌ టార్షన్ స్కామ్‌ లలో బ్రిటీష్ యువకులను లక్ష్యంగా చేసుకుంటాయని యూకే పోలీసులు గత నెలలో హెచ్చరించిన తర్వాత ఈ నివేదిక రావడం గమనార్హం. ప్రభుత్వేతర సంస్థలు, పోలీసుల ప్రకారం... ప్రత్యేకించి యుక్తవయసులోని అబ్బాయిలపై ఈ తరహా కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News